కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్3 షో రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న సభ్యులు ఒకరినిమించి ఒకరు పోటీ పడుతుండడంతో ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే టైటిల్ కోసం శ్రీముఖి, వరుణ్ సందేశ్, హిమజ, పునర్నవి లాంటి సెలెబ్రిటీలు గట్టిగా పోటీ పడుతున్నారు. 

మిగిలిన వారు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిలో అషు రెడ్డి యూట్యూబ్ లో దబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయింది. సినిమా నటిగా కూడా మారింది. అషు రెడ్డి ఇంత వరకు హౌస్ లో ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేదనే చెప్పాలి. కాగా అషు రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. 

దీనితో ఈ యూట్యూబ్ పిల్లకు పవన్ ఫ్యాన్స్ నుంచి మద్దతు లభిస్తుందేమో చూడాలి. గత ఏడాది శ్రీరెడ్డి, కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై అనేక వివాదాలు సృష్టించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో అషు రెడ్డి పవన్ కళ్యాణ్ కు మద్దతు గా సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ టాటూని ఎద భాగంలో వేయించుకున్న దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

ashu reddy

నేను పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకున్నాను.. అంటే నాకు కూడా పవన్ తో సంబంధాలు ఉన్నట్లా అని కత్తి మహేష్ ని ప్రశ్నించింది. ఇక అషు రెడ్డికి జూనియర్ సమంతగా కూడా మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ కి ధీటుగా అషు పోటీ ఇస్తే ఆమె కూడా టైటిల్ రేసులో నిలుస్తుంది. ఈ పవన్ వీరాభిమానికి ఆయన ఫ్యాన్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందో వేచి చూడాలి.