తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌  హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.  

అశోక్ గల్లా(Ashok Galla) హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘హీరో’(Hero). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే సంవత్సరం జనవరి 26వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీని తెలియజేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లోAshok Galla యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఇక మహేష్ బాబు(Maheshbabu) ఈ చిత్రం ప్రమోషన్స్ కు నడుం బిగించనున్నట్లు సమాచారం. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేయాలని ప్లాన్ చేసారట. Mahesh Babu ఫ్యామిలీ మొత్తం వచ్చి తమ ఆశీస్సులు అందచేయనున్నారు. అలాగే మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా కూడా ప్రమోట్ చేస్తారట. మహేష్ బాబు ఫ్యాన్స్ సైతం ఈ సినిమాని తమ హీరో సినిమాలాగ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయబోతున్నారట.ఆ విధంగా ఈ సినిమాని అన్ని వైపుల నుంచి బజ్ క్రియేట్ చేయటానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ సమయానికి ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు సైతం ట్వీట్స్ వేయబోతున్నారట. మహేష్ తన సొంత సినిమా కన్నా ఎక్కువగా ఈ సినిమాని తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ఇటీవల రానా విడుదల చేసిన తెలుగందమే లిరికల్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అశోక్‌ గల్లాను పవర్‌ఫుల్ రోల్‌లో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మరింత పవర్ ఫుల్‌గా చూపించినట్లుగానూ, అతని డెబ్యూట్‌కి ఇది పర్ఫెక్ట్ చిత్రమని మేకర్స్ చెబుతున్నారు. 

also read: National Crush: రష్మిక మందన్నాకి నిధి అగర్వాల్ దిమ్మతిరిగే షాక్‌‌.. పవన్‌ కళ్యాణ్‌ని చూసుకునేనా ఈ దూకుడు?

యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో అశోక్‌కు జోడీగా నటి నిధి అగర్వాల్‌ సందడి చేయనున్నారు. జగపతిబాబు, నరేశ్‌, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. జిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. అమరరాజా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

aslo read: సమంత ఫ్యాన్స్ కి కిక్కిచ్చే బజ్.. 'దూకుడు' కాంబో రిపీట్, రాజమౌళి అప్రోచ్ అయ్యారా ?