Asianet News TeluguAsianet News Telugu

దెయ్యంతో లవ్.. ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య 'లవ్ మీ' ట్రైలర్ అదిరిపోయిందిగా

ఆశిష్ రెడ్డి నటించిన లేటెస్ట్ మూవీ లవ్ మీ. ఈ చిత్రంలో ఆశిష్ రెడ్డి, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఉత్కంఠని పెంచడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెంచేస్తోంది.

Ashish Reddy and Vaishnavi Chaitanya Love Me Trailer out now dtr
Author
First Published May 16, 2024, 8:20 PM IST

దిల్ రాజు సోదరుడి కొడుకుగా టాలీవుడ్ కి పరిచయమైన ఆశిష్ రెడ్డి ఇంకా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందలేదు. చివరగా ఆశిష్ రెడ్డి నటించిన రౌడీ బాయ్స్ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఆశిష్ రెడ్డి సొంత బ్యానర్ లోనే మరో ప్రయత్నంతో వచ్చేస్తున్నాడు. ఆశిష్ రెడ్డి నటించిన లేటెస్ట్ మూవీ లవ్ మీ. 

ఈ చిత్రంలో ఆశిష్ రెడ్డి, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఉత్కంఠని పెంచడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెంచేస్తోంది. ఏకంగా దెయ్యంతో ప్రేమ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

ట్రైలర్ లో విశేషాలు గమనిస్తే.. ప్రతి రోజు రాత్రి 8 గంటలకు అలారం మోగుతుంది. అందరూ తమ ఇంటి తలుపులు మూసేస్తారు. కానీ ఒక అమ్మాయి మాత్రం తలుపులు తీసి షాక్ అవుతుంది. అప్పుడే హీరో ఆశిష్ రెడ్డి ఎంట్రీ ఇస్తాడు. చేయవద్దు అనే పనిని మాత్రమే చేసే మెంటాలిటీ ఉన్న కుర్రాడు ఆశిష్ రెడ్డి. 

 

అడవిలో ఒక మహల్ ఉంటుంది. ఆ మహల్ డేంజర్ అక్కడికి వెళ్లొద్దు అని అంతా చెబుతారు. అందులో దివ్యవతి అనే దెయ్యం ఉంది. ఆమెని ఒకసారి చూస్తే చాలు చంపేస్తుంది. కానీ అర్జున్ ని చంపదు. అసలు దివ్యవతి ఎవరు ? ఆమె దెయ్యంగా ఎందుకు మారింది ? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. వైష్ణవి చైతన్య ఇందులో హీరో ఫ్రెండ్ గా కనిపిస్తూ ఉంది. దెయ్యంతో పెట్టుకోవద్దుఅని హెచ్చరిస్తూ ఉంటుంది. మొత్తంగా ట్రైలర్ చూపించిన విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. 

ఈ తరహా కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్ కి కొత్త అనే చెప్పొచ్చు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మే 25న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios