విక్రమ్ విజయంతో కమల్ హాసన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో విక్రమ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు రికార్డు వసూళ్లు రాబడుతుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

చాలా కాలం తర్వాత కమల్ హాసన్ (Kamal Haasan) కి భారీ కమర్షియల్ హిట్ దక్కింది. విక్రమ్ మూవీ అన్ని భాషల్లో దూసుకుపోతుంది. తెలుగు హీరో నితిన్ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. నాలుగు రోజుల్లో విక్రమ్ బ్రేక్ ఈవెన్ కి చేరింది. వరల్డ్ వైడ్ గా విక్రమ్ రూ. 200 కోట్ల మార్కుకి దగ్గరైంది. విక్రమ్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ డే నుండి క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో మూవీ దూసుకుపోతుంది. 

ఇక విక్రమ్(Vikram Movie) మూవీపై తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణకు, అందించిన విజయానికి కమల్ హాసన్ ఆనందం వ్యక్తం చేశారు. మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్న ఆయన మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అన్నారు. ఇక కీలక రోల్స్ చేసిన ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతితో పాటు చివర్లో గెస్ట్ రోల్ చేసిన సూర్యలను కమల్ హాసన్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. దర్శకుడు కనకరాజ్ తో పాటు సినిమాలు పనిచేసిన సాంకేతిక నిపుణులకు, నటులకు పేరు పేరున కమల్ హాసన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యతో విక్రమ్ 2 మూవీపై కమల్ హింట్ ఇచ్చారు. 

Scroll to load tweet…

కమల్ హాసన్ విక్రమ్ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో తెరకెక్కించారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో కమల్ హాసన్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి లగ్జరీ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. కొడుకుని చంపిన డ్రగ్స్ మాఫియాపై రివేంజ్ తీర్చుకునే ఒకప్పటి ఇండియన్ ఏజెంట్ గా కమల్ హాసన్ నటించారు. ఫహాద్ ఫాజిల్ కమల్ వెంటాడే అధికారి పాత్ర చేయగా, విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశారు. చివర్లో సూర్య డ్రగ్స్ మాఫియా అధినేత రోలెక్స్ సర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అనిరుధ్ మ్యూజిక్ సినిమా విజయంలో కీలకంగా మారాయి.

Scroll to load tweet…