బిగ్ బాస్ షో చివరి అంకానికి చేరింది. మరో మూడు వారాల్లో విన్నర్ ఎవరో తేలిపోనున్నారు. బిగ్ హౌస్ లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. అవినాష్, అరియనా, అభిజిత్, హారిక, సోహైల్, మోనాల్ మరియు అఖిల్ హౌస్ లో ఉన్నారు. వీరిలో నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేషన్స్ కొరకు నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం ఈ నలుగురిలో ఒకరు ఎలిమినేటయ్యే అవకాశం కలదు. 

బిగ్ బాస్ సీజన్ ముగియనున్న నేపథ్యంలో విన్నర్ ఎవరనే విషయంపై సర్వేలు కూడా జరుగుతున్నాయట. ఈ సర్వేలో కొన్ని షాకింగ్ నిజాలు బయటికి వచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇంటిలో ఉన్న సభ్యులలో టైటిల్ విన్నర్ ఎవరని ప్రేక్షకులను అడుగగా మెజారిటీ ప్రేక్షకులు అభిజీత్ పేరు చెప్పారట. ఆ తరువాత సోహైల్ పేరు వినిపిస్తుందట. మెజారిటీ ప్రేక్షకులు అభిజిత్ మరియు సోహైల్ టైటిల్ రేసులో ఉన్నారని చెప్పారట. 

మరి ఈ సర్వేలలో ఎంత వరకు ఖచ్చితత్వం, నిజం ఉందో తెలియదు కానీ, టైటిల్ విన్నర్స్ గా అభిజిత్, సోహైల్ పేర్లు బయటికి వస్తున్నాయి. హౌస్ లో కెప్టెన్ పోస్ట్ కూడా బిగ్ బాస్ తీసేశాడు. ఇకపై ఇంటికి ఎవరూ కెప్టెన్ గా ఉండరని చెప్పడం జరిగింది. గత మూడు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కి అంతగా ఆదరణ దక్కలేదు. టీఆర్పీ పరంగా కూడా చాలా తక్కువ దక్కించుకుంది.