బాలీవుడ్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే హీరోలలో షారుఖ్ ముందుంటాడు. ఫిజిక్ విషయంలో.. కుర్ర హీరోలు కూడా షారుఖ్ మీదకు రారు.. అంత క్రమశిక్షణతో కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక త్వరలో తన కొడుకు ఆర్యాన్ ఖాన్ టర్మ్ స్టార్ట్ కాబోతోంది. 

బాలీవుడ్ ను కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్నాడు స్టార్ సీనియర్ హీరో షారుక్ ఖాన్. 60 ఏళ్లు వస్తున్నా.. 30 ఏళ్ళ హీరోలా.. సిక్స్ ప్యాక్ తో కుర్ర హీరోలకు కుళ్లు పుట్టేలా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్ టర్మ్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో పలు వివాదాలకు సెంటర్ గా నిలిచిన ఆర్యాన్ ఖాన్.. ఇండస్ట్రీలో ఫుల్ బిజీ కాబోతున్నాడట. అయితే ఈ విషయంలో తండ్రి షారుఖ్ ఖాన్ మాట కూడా వినడం లేదట ఆర్యాన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న షారుక్ ఖాన్ తన కొడుకును కూడా హీరో చేయాలని ఎన్నో కలలు కంటున్నారు. 

అందుకు తగ్గట్టుగానే షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా అతనిలాగే మంచి లుక్స్ తో పాటు హీరో అవ్వడానికి అన్ని విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఇంకే మంరి బాలీవుడ్ బరిలోకి దిగి సత్తా చూపనించబచ్చు కదా అని అంతా అనుకుంటున్న వేళ.. ఆర్యన్ ఖాన్ మాత్రం షారుఖ్ కు షాక్ ఇచ్చాడట. తాను హీరోగా ఉండను.. దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేస్తాను.. అదికూడా నా సొంత టాలెంట్ తో ఎదుగుతాను కాని.. నీ పేరువాడుకోను అని అంటున్నాడట ఆర్యన్ ఖాన్. అంతే కాదు షారుఖ్ కూడా తన కొడుకుకి ఇష్ట మైన డైరెక్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. కాస్తి లిప్ట్ ఇద్దామని చూశాడట. 

ఆర్యాన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే తన తొలి వెబ్ సిరీస్ లో షారుక్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి.. కాస్త ఫుష్ చేద్దామని కూడా చూశాడట. కాని ఆ విషయంలో కూడా ఆర్యన్ ఖాన్ నో చెప్పాడని, తన వెబ్ సిరీస్ కోసం 120 కోట్లు ఆఫర్ చేసినా.. ఓటీటీని కూడా దూరం పెట్టాడని వార్తలు వస్తుండగా.. ఇవి చాలా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఒక స్టార్ హీరో కొడుకు.. డైరెక్టర్ అయినా .. హీరో అయినా సరే తన తొలి సినిమాలో అలాగే తర్వాత సినిమాలలో కూడా తమ తండ్రులను తమ సినిమాలలో అతిధి పాత్రలో చూపించి క్యాష్ చేసుకోవాలని అనుకుంటారు. కాని ఆర్యన్ ఖాన్ మాత్రం తన సొంత కాళ్ల మీద నిలబడాలని ప్రయత్నించడం అందరిని ఆకట్టుకుంటుంది. 

స్టార్ హీరో కొడుకుగా..షారుక్ స్టార్ డమ్ ను.. హోదాను అనుభవిస్తున్నాడు అన్న పేరు రాకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నాడట ఆర్యన్ ఖాన్. మరి మనోడి బాలీవుడ్ ప్రయత్నాలు ఎలా ఉంటాయి.. దర్శకుడిగా ఏం చేయబోతున్నాడు. ముందు ముందు ఆర్యన్ ఖాన్ ను ఎలా చూడబోతున్నాము అనేది ఉత్కంటగా మారింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా చేస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.