సాధారణంగా బూతు చిత్రం దర్శకుడు అని పేరు పడితే ..ఏ హీరో ఆ డైరక్టర్ తదుపరి చిత్రంలో నటించటానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఓ స్దాయిలో ఉన్న హీరోలు అయితే మాట్లాడటానికి కూడా ధైర్యం చేయరు. ఎక్కడ తమ ఫ్యామిలీ బేస్ ఫాలోయింగ్ కు ఇబ్బంది కలుగుతుందో అని దూరం పెట్టేస్తూంటారు.

సాధారణంగా బూతు చిత్రం దర్శకుడు అని పేరు పడితే ..ఏ హీరో ఆ డైరక్టర్ తదుపరి చిత్రంలో నటించటానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఓ స్దాయిలో ఉన్న హీరోలు అయితే మాట్లాడటానికి కూడా ధైర్యం చేయరు. ఎక్కడ తమ ఫ్యామిలీ బేస్ ఫాలోయింగ్ కు ఇబ్బంది కలుగుతుందో అని దూరం పెట్టేస్తూంటారు. అలాంటిది అరవింద్ స్వామి ...చీకట్లో చితక్కొట్టుడు డైరక్టర్ తో తన ప్రధాన పాత్రలో నటించటానికి ఓకే చేసారు. ఈ సినిమా తాజాగా లాంచ్ అయ్యింది. సిని ఇండస్ట్రీనే కాక సినిమా అభిమానులు సైతం అరవింద్ స్వామి ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు.

మణిరత్నం రోజా చిత్రంతో పరిచయం అయిన అరవింద్ స్వామికి ఆ మధ్యన బాగా గ్యాప్ వచ్చింది. రీ ఎంట్రీ చిత్రం ‘తని ఒరువన్‌’ (ధృవ) తర్వాత అరవింద్‌స్వామి మళ్లీ బిజీ అయ్యారు. తాజాగా ఆయన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సంతోష్‌ పి.జయకుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డిటెక్టివ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మదియళగన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో జరిగింది. 

హరహర మహా దేవకి, ఇరుట్టు అరైయిల్‌ మురట్టుకుత్తు, గజినికాంత్‌ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంతోష్‌ పి.జయకుమార్‌కు ఇది నాలుగో చిత్రం. ఇప్పటి వరకు హర్రర్‌, హాస్య ప్రధాన చిత్రాలు రూపొందించిన ఆయన తొలిసారిగా డిటెక్టివ్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. జూన్‌ నుంచి షూటింగ్ కొనసాగనుంది. ఈ సినిమాకు ఇమాన్‌ సంగీతం పెద్ద బలంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. హీరోయిన్ , ఇతర నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయి.