భారత దిగ్గజ క్రికెటర్స్ లో Kapil Dev ఒకరు. టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన సారథి అతడు. 1983లో ఇండియా ప్రపంచకప్ గెలవడంలో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న బయోపిక్ చిత్రం 83.

భారత దిగ్గజ క్రికెటర్స్ లో Kapil Dev ఒకరు. టీమిండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన సారథి అతడు. 1983లో ఇండియా ప్రపంచకప్ గెలవడంలో కపిల్ దేవ్ కీలక పాత్ర పోషించారు. కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న బయోపిక్ చిత్రం 83. కపిల్ జీవిత చరిత్రని వెండితెరపై ఆవిష్కరిస్తూనే 1983 నాటి ప్రపంచ కప్ గెలుపు మధుర క్షణాలు, భావోద్వేగాల్ని దర్శకుడు కబీర్ ఖాన్ చూపించబోతున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రపంచ కప్ బరిలోకి దిగిన టీమిండియా కపిల్ దేవ్ విజయ బాటలో ఎలా నడిపించాడు.. టీంలో ఎలా ఆత్మవిశ్వాసం నింపాడు అనే సంగతులని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలవుతున్న ఈ మూవీ కోసం దేశం మొత్తం క్రీడా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు. 

Also Read: Balayya with Raviteja: రవితేజనేకాదు.. తాను కూడా అమ్మాయిలకు లైన్‌ వేసేవాడినంటూ బాలయ్య షాకింగ్‌ కామెంట్‌

1983 ప్రపంచకప్ విజయం భారత క్రికెట్ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. ఈ కథాంశంతో తెరకెక్కుతున్న 83 చిత్రానికి ప్రభుత్వాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ చిత్రం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 83 చిత్రానికి పన్ను మినహాయింపు కల్పించాలని నిర్ణయించారు. 

కేజ్రీవాల్ నిర్ణయంతో చిత్ర నిర్మాణ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. సీఎం కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. 

రణవీర్ సింగ్ ఈ చిత్రం కోసం పూర్తిగా కపిల్ దేవ్ లాగా మారిపోయాడు. రణ్‌వీర్ సింగ్‌తో పాటు పంకజ్ త్రిపాఠి, దీపికా పదుకొణె, అమీ విర్క్, హార్డీ సంధు, చిరాగ్ పాటిల్, తాహిర్ రాజ్ భాసిన్ వంటి పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. 

Scroll to load tweet…