Asianet News TeluguAsianet News Telugu

#Article370: సరిపోయింది..ఈ సినిమాని బ్యాన్ చేసేసారా?

 ‘ఫైటర్’ అక్కడ బ్యాన్ అవ్వగా ఈసారి మరో హిందీ చిత్రం కూడా విడుదల కాకుండా ఆగిపోవడం బాలీవుడ్ దర్శక,నిర్మాతలకు ఆందోళన కలిగిస్తోంది. 

Article 370 has been banned in Gulf countries jsp
Author
First Published Feb 27, 2024, 1:21 PM IST

బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం #Article370. స్టార్ క్యాస్టింగ్ లేని ఆర్టికల్ 370 సూపర్ హిట్  దిశగా దూసుకుపోవడం ఎవరూ ఊహించలేదు మొన్న శుక్రవారం థియేటర్లలో అడుగు పెట్టిన ఈ పొలిటికల్ డ్రామా... 99 రూపాయల మల్టీప్లెక్సుల వన్ డే ఆఫర్ ని బ్రహ్మాండంగా వాడుకుని అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంది.  అయితే ఇప్పుడీ చిత్రం గల్ప్ కంట్రీస్ లో నిషేధానికి గురి అయ్యింది. 

ఈమధ్య కాలంలో  గల్ఫ్ దేశాల్లో ఇండియన్ సినిమాలు నిషేధానికి గురి అవుతున్నాయి.  సినిమాలో కంటెంట్ భారత్‌కు సంబంధించిన విషయాలపై తెరకెక్కించి ఉంటే.. ఖచ్చితంగా బ్యాన్ పెట్టేస్తున్నారు. ఈవిషయాలపై  గల్ఫ్ దేశాలు చాలా స్ట్రిక్ గా ఉంటున్నాయి. కొన్నిరోజుల క్రితం హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ మూవీకి ఇదే సమస్య ఎదురవ్వగా.. ఇప్పుడు యామీ గౌతమ్ లీడ్ రోల్ చేసిన ‘ఆర్టికల్ 370’ని కూడా విడుదల చేయడానికి గల్ఫ్ దేశాలు ఒప్పుకోవడం లేదు.   ఇండియాలో మాత్రం ఈ సినిమా విడుదలయ్యి హిట్ టాక్‌ను అందుకోవటం కలిసొచ్చే అంశం.
 
‘ఆర్టికల్ 370’కేవలం మన దేశంలో మాత్రమే కాదు.. ఓవర్సీస్‌లో కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విమర్శకులు సైతం ఈ మూవీకి ప్రశంసలు అందిస్తున్నారు. అయితే గల్ఫ్ దేశంలో బ్యాన్ అవ్వడం మాత్రం ఎవరూ ఊహించలేదు.   ‘ఫైటర్’ అక్కడ బ్యాన్ అవ్వగా ఈసారి మరో హిందీ చిత్రం కూడా విడుదల కాకుండా ఆగిపోవడం బాలీవుడ్ దర్శక,నిర్మాతలకు ఆందోళన కలిగిస్తోంది. గల్ఫ్ దేశాల్లో కూడా హిందీ సినిమాలు చూసేవారు గట్టిగానే  ఉంటారు.  ‘ఫైటర్’, ‘ఆర్టికల్ 370’లాంటి చూడలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 
 
ఇక ‘ఆర్టికల్ 370’ సినిమా పూర్తిగా టైటిల్‌కు తగినట్టుగానే పూర్తిగా ఆర్టికల్ 370పైనే తిరుగుతుంది. కథేమిటంటే...  ఇంటెలిజెంట్ ఏజెంట్ జూని అక్సర్(యామీ గౌతమ్), పీఎం ఆఫీస్ కీలక పదవిలో ఉండే స్వామినాథన్(ప్రియమణి)ల చుట్టూ కథ తిరుగుతుంది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒకే ఐడియాలజీ. ప్రధాన మంత్రి(అరుణ్ గోవిల్)మద్దతు వీళ్లకు ఉంటుంది. ప్రమాదరకమైన తీవ్రవాదిని పట్టుకున్న కేసులో జూనికి   గుర్తింపు రాకపోయినా ఎన్ఐఏలో భాగమవుతుంది. ఆర్టికల్ 370కు సంబంధించిన చర్యలు ప్రభుత్వం వైపు నుంచి మొదలయ్యాక జూనీ, స్వామినాథన్ లు ఏం చేసారు. తీవ్ర రాజకీయ పరిణామాలు, సామాజిక అలజడులు తలెత్తిన సమయంలో ఎలా స్పందించారు అనేది సినిమా.  2019 ఆగస్ట్ 5న జమ్మూ కశ్మీర్‌కు ఉన్న స్పెషల్ స్టేటస్‌ను తొలగించి, వాటిని కూడా టెర్రిటెరీలలో కలిపేసింది భారత ప్రభుత్వం. ఈ సినిమా మొత్తం ఆ సంఘటనపైనే ఆధారపడి తెరకెక్కించారు దర్శకుడు సుహాస్ జంభలే. మూవీని యామీ గౌతమ్ భర్త, బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మించాడు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios