Asianet News TeluguAsianet News Telugu

#ArrestPoonamPandey : ఫూల్స్‌ని చేసింది.. పబ్లిసిటీ కోసం దిగజారాలా, పూనమ్‌పై ట్రోలింగ్ మామూలుగా లేదుగా

సర్వైకల్ క్యాన్సర్‌తో తాను చనిపోయానంటూ పెద్ద డ్రామా ఆడిన బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)పై అవగాహన కల్పించేందుకే తాను మరణించినట్లుగా నాటకం ఆడానంటూ చావు కబురు చల్లగా చెప్పింది పూనమ్.

ArrestPoonamPandey: Model slammed for faking death due to cervical cancer; stunt labelled cheap, shameful ksp
Author
First Published Feb 3, 2024, 3:15 PM IST

సర్వైకల్ క్యాన్సర్‌తో తాను చనిపోయానంటూ పెద్ద డ్రామా ఆడిన బాలీవుడ్ నటి పూనమ్ పాండేపై దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)పై అవగాహన కల్పించేందుకే తాను మరణించినట్లుగా నాటకం ఆడానంటూ చావు కబురు చల్లగా చెప్పింది పూనమ్. ఈ క్రమంలో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పూనం చనిపోయారన్న వార్త తెలిసి తాము కలత చెందామని, కానీ అంతలోనే ఇదంతా అబద్ధమని తెలియడంతో ఆమెపై పట్టరాని కోపం వస్తోందంటూ నెటిజన్లు తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. పూనం పాండేను తక్షణం దేశం నుంచి బహిష్కరించడంతో పాటు అరెస్ట్‌ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. 

 

 

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని తన నివాసంలో గురువారం రాత్రి 32 ఏళ్ల పూనం పాండే గర్భాశయ క్యాన్సర్‌తో నివేదికలు వెలువడటంతో దేశ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే మూడు రోజుల క్రితం గోవాలో పూనం పాండే కనిపించిన దృశ్యాలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అసలు చనిపోయిందా..? లేదా అన్న అనుమానాలు అందరిలో తలెత్తాయి. ఈ క్రమంలో స్వయంగా పూనం పాండే సోషల్ మీడియా ద్వారా తాను బతికే వున్నానని వివరణ ఇచ్చారు. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఇలా చేశానని పూనం తెలిపారు. దీంతో నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చౌకబారు పబ్లిసిటీ స్టంట్‌గా వారు అభివర్ణించారు.

 

 

ఇవాళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో పూనం పాండే ఇలా అన్నారు. ‘‘ మీ అందరితో ఓ ముఖ్యమైన విషయం పంచుకోవాలని నేను భావిస్తున్నాను. తాను ఎక్కడికి పోలేదు, బ్రతికే వున్నాను. గర్భాశయ క్యాన్సర్ నాకు సోకలేదు. కానీ విషాదకరంగా, ఇది వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల మహిళలు మరణిస్తున్నారు. ఈ వ్యాధి గురించి క్లిష్టమైన అవగాహనని వ్యాప్తి చేయాలనుకుంటున్నాను, ప్రతి స్త్రీకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయాలనుకుంటున్నాను. కలిసికట్టుగా సర్వైకల్ క్యాన్సర్ వినాశకరమైన ప్రభావాన్ని అంతం చేయడానికి #DeathToCervicalCancer తీసుకురావడానికి కృషి చేద్దాం అని ’’ పూనం రాసుకొచ్చారు. 

అయితే.. పాండే ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి సున్నితమైన సమస్యను ఉపయోగించుకున్నారని నెటిజన్లు విమర్శించారు. అవగాహన కోసం మరణాన్ని అనుకరించడంతో ఆమె ఆగ్రహం, అపనమ్మకాన్ని ఎదర్కొంటోంది. ‘‘ నిన్న #PoonamPandeyDeath అని ప్రకటించినప్పుడు దానిని చిత్రీకరించిన విధానం చేపలు పట్టినట్లుగా, నమ్మశక్యం కానిదిగా అనిపించింది. బాలీవుడ్‌ దీనికి స్పందించడం అమాయకత్వం, పూనమ్ ఇలా చేయడం ఆమె మూర్ఖత్వం. ఇది చాలా తప్పుడు పని.. ఇలాంటి విన్యాసాల నేపథ్యంలో పూనమ్‌ను మీడియా బహిష్కరించాలి. నకిలీ మరణవార్తను వ్యాపింపజేసినందుకు @MIB_India పూనమ్ పాండేపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఓ యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

 

 

‘‘ ఆమె పూర్తి నకిలీ, ఆమె చెప్పేది కూడా నకిలీ. పూనమ్‌ పాండేని బహిష్కరించండి’’ అని మరో యూజర్ కోరారు. ‘‘ఎట్టకేలకు పూనమ్ బతికే వుంది. గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఆమె తన మరణాన్ని నకిలీ చేసింది. ఇందులో వాస్తవం ఏంటంటే.. అది అవగాహన కల్పించడానికి కాదు, భయాన్ని సృష్టించడానికి , బిల్‌గేట్స్ నిధులతో కూడిన వ్యాక్సిన్‌ను బహిష్కరించడానికి, ప్రజలను మోసం చేయడానికి ఆమె ఇలా చేసింది’’ అని ఓ యూజర్ పేర్కొన్నారు. నాల్గవ నెటిజన్ ఆమెను అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ.. ‘‘ పూనం పాండే ఓ అటెన్షన్ సీకర్, ఆమెను అరెస్ట్ చేయండి’’ అంటూ పోస్ట్ చేశాడు.

ప్రజలను తప్పుదారి పట్టించినందుకు , గర్భాశయ క్యాన్సర్‌తో ఆటలు ఆడినందుకు పోలీసులు పూనమ్ పాండేను అరెస్ట్ చేయాలి,  ఆమెకు ప్రచారం అవసరమని మరో యూజర్ జోడించారు. 

పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్‌పై నెటిజన్లు ఎలా స్పందించారో ఇక్కడ చూడండి , పలువురు యూజర్లు ఆమెను అరెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. 

 

 

ఈ మొత్తం సంఘటన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలను బాధ్యతాయుతంగా ఉపయోగించడం, క్లిష్టమైన ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడంలో నైతిక ప్రవర్తన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఒకరి మరణాన్ని నకిలీ చేయడం, ప్రత్యేకించి గర్భాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యం నేపథ్యంలో .. నిజంగా వ్యాధిబారిన పడిన వారికి కలిగించే అవగాహన, మద్దతు కోసం చేసే యత్నాలను ఇలాంటివి బలహీనపరుస్తాయి. 

పూనమ్ పాండే కల్పిత మరణం చుట్టూ వున్న వివాదం.. సమగ్రత, సున్నితత్వాన్ని పణంగా పెట్టి వైరల్‌ని వెంటాడే వారికి ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది. డిజిటల్ యుగంలో ప్రామాణికమైన న్యాయవాదం, దృష్టిని ఆకర్షించే జిమ్మిక్కుల మధ్య వాస్తవాలను గుర్తించే ప్రభావశీలురకు ఇది మేల్కోలుపు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios