మరోసారి వివాదం అయ్యారు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్. ఈసారి ఏకంగా వ్యవహారం అరెస్ట్ వారెంట్ వరకూ వెళ్లింది. ఇక ఇవాళ్లో.. రేపో అరెస్ట్ కు రంగం సిద్థం అయ్యింది.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ అరెస్ట్ కు రంగం సిద్థం అవుతోంది. ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్ XXX సీజన్2 లో సైనికులను కించపరచడం మరియు వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసిన ఆరోపణలపై సినీ నిర్మాత మరియు దర్శకురాలు ఏక్తా కపూర్ మరియు ఆమె తల్లి శోభా కపూర్‌పై బీహార్‌లోని బెగుసరాయ్‌లోని కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
బెగుసరాయ్ నివాసి, మాజీ సైనికుడు శంభు కుమార్ చేసిన ఫిర్యాదు ఆధారంగా న్యాయమూర్తి వికాస్ కుమార్ ఈ వారెంట్ జారీ చేశారు. Mr కుమార్, 2020లో ఈరకంగా కంప్లైయింట్ ఇచ్చాడు. తను ఇచ్చిన ఫిర్యాదులో, XXX సీజన్-2 సిరీస్‌లో సైనికుడి భార్యకు సంబంధించిన అనేక అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు.
ఇక ఈ వివాదానికి సబంధించిన ఎపిసోడ్స్ కూడా ఏక్తా కపూర్ కు చెందిన బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ యాజమాన్యంలోని OTT ప్లాట్‌ఫారమ్ అయిన ALTBalajiలో టెలికాస్ట్ చేయబడింది. ఏక్తా కపూర్ తల్లి శోభా కపూర్ కూడా ఇందులో భాగస్వామిగా ఉండటంవల్ల ఆమెపై కూడా కేసు నమోదు అయ్యింది. బాలాజీ టెలిఫిల్మ్స్‌తో ఏక్తాకపూర్ తో పాటు ఆమె తల్లికి కూడా సంబంధం కలిగి ఉంది అని శంభు కుమార్ న్యాయవాది హృషికేష్ పాఠక్ కోర్టుకు విన్నవించారు.
దాంతో కోర్టు ఏక్తా కపూర్ తో పాటు ఆమె తల్లి శోభా కపూర్ కు కూడా సమన్లు జారీ చేసింది. అంతే కాదు కోర్టుకు తప్పకుండా హాజరుకావాలిన ఆదేశంచింది. అయితే ఈ విషయంలో .. ఫిర్యాదు అందిన వెంటనే ఈసిరిస్ లోని అభ్యంతరకర సన్నివేశాలు కొన్ని తొలగించినట్లు కోర్టుకు తెలియజేశారు. అయితే కోర్టు ఆదేశం ప్రకారం వారు హాజరు కాకపోవడంతో వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్టు మిస్టర్ పాఠక్ తెలిపారు.
