ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ కి చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికాలో జొహానెస్‌బర్గ్‌లో శనివారం నాడు ఆర్నాల్డ్ 'క్లాసిక్ఆఫ్రికా' పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ క్రమంలో ఆర్నాల్డ్ అభిమానులతో మట్లాడుతూ వారితో స్నాప్ చాట్ వీడియో రికార్డ్ చేయాలనుకున్నారు.

ఆ సమయంలో ఓ వ్యక్తి వెనుక నుండి ఎగిరి వచ్చి ఆర్నాల్డ్ ని కాలితో తన్నాడు. వెంటనే అక్కడున్న సెక్యురిటీ అలర్ట్ అయ్యి సదరు వ్యక్తిని అక్కడ నుండి తీసుకువెళ్లిపోయారు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీన్ని ఆర్నాల్డ్ షేర్ చేస్తూ తననెవరో తన్నారని ఈ వీడియో చూస్తే కానీ తెలియలేదని.. ఆ ఇడియట్ స్నాప్ చాట్ వీడియోను పాడుచేయనందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఒకవేళ వీడియో షేర్ చేయాలనుకుంటే ఆ వ్యక్తి అరుపులు వినిపించకుండా ఉన్న వీడియోను తీసుకోండని.. ఎందుకంటే ఇలా చేసినందుకు అతడికి పాపులారిటీ రాకూడదని అన్నారు.

దక్షిణాఫ్రికాలో ఆర్నాల్డ్ స్పోర్ట్స్ క్లబ్ లో 90 రకాల క్రీడలు ఉన్నాయని.. 24వేల అథ్లెట్ లు ఉన్నారని.. ఈ వీడియో ద్వారా వారికి పాపులారిటీ దక్కేలా చేద్దామని అన్నారు. ఇది ఇలా ఉండగా .. ఆర్నాల్డ్ సదరు యువకుడు ఎందుకు కాలితో తన్నాడనే విషయం తెలియరాలేదు.