టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తెలియని నార్త్ సెలబ్రెటీలు ఉండరు. బన్నీ స్టామినా ఏంటో దాదాపు ఇండియన్ సెలబ్రెటీలందరికి తెలుసు. ఇండియన్ మోస్ట్ స్టైలిష్ స్పీడ్ డ్యాన్సర్ల హీరోల లిస్ట్ లో మనోడు కూడా ఉన్నాడు. ఇకపోతే ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు టెక్నీషియన్స్ బన్నీ అంటే చాలా ఇష్టమని చెప్పారు. 

రీసెంట్ గా స్టార్ సింగర్ అర్మన్‌ మాలిక్‌ కూడా అల్లు అర్జున్ స్టయిల్ కి ఫిదా అయిపోతా అని వివరించాడు. ఆయన తన ఫెవరెట్ హీరో అంటూ ప్రతి సినిమాను చూస్తాను అని తెలిపాడు. నా పేరు సూర్య సినిమాలో బ్యూటీ ఫుల్ లవ్ అనే పాట పాడే అవకాశం రావడంతో అప్పుడు ఆయన్ను కలిశాను. బన్నీ  సిగ్నేచర్‌ అంటే నాకు పిచ్చి అంటూ హైదరాబాద్ తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని ఇంటర్వ్యూలో చెప్పాడు. 

తన బంధువులు చాలామంది హైదరాబాద్ లోనే ఉన్నారంటూ నైట్ లాంగ్ డ్రైవ్ లకి హెల్మెంట్ పెట్టుకొని ఫ్రెండ్స్ తో వెళ్తానని చెప్పాడు. ఇక బిర్యానీ గోంగూర ఇతర సౌత్ వంటకాలను ఇష్టంగా తింటాను అని అర్మన్ తెలిపాడు. రీసెంట్ గా ఉప్పల్ లో జరిగిన ఇండియా - ఆస్ట్రేలియా మ్యాక్ కోసం వచ్చిన ఈ యువ సంగీత కెరటం ఈ విధంగా తన ఇష్టాలను ఇంటర్వ్యూలో తెలియజేశాడు.