ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ఇంటి ముందు నటుడు అర్మాన్ కోహ్లీ మూత్రం పోయడం పలువురిని షాక్ కి గురి చేసింది. కోపంతోనే అర్మాన్ ఈ విధంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. తన కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్ధం కాక హీరోయిన్ ఇంటి ముందు ఇలాంటి చర్యకి పాల్పడ్డాడు.

అసలు విషయంలోకి వస్తే.. రాణీ ముఖర్జీ కజిన్ తానీషా ముఖర్జీతో అర్మాన్ ఏడాది పాటు డేటింగ్ చేశాడు. కానీ వారిద్దరి మధ్య గొడవలు రావడంతో ఈ జంట విడిపోయారు. విడిపోయే సమయంలో తనీషా.. అర్మాన్ ని కొట్టినట్లు సమాచారం. ఆ కారణంగానే ఆమెపై ద్వేషాన్ని పెంచుకున్నాడు.

ఆ కారణంగానే సినీ నటి రాణీముఖర్జీ నివాసం ముందు మూత్రం పోశాడట. అర్మాన్ వికృతి చేష్టలకు పాల్పడుతున్న సమయంలో అక్కడ ఉన్న మీడియా వర్గాలు ఫోటోలు తీయడంతో విషయం బయటకి వచ్చింది.

అర్మాన్ పై ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాదిలో నీరూ రాంధవ అనే అమ్మాయితో డేటింగ్ చేసి, ఆమెను ఇష్టమొచ్చినట్లు గాయపరిచి ఇంట్లో నుండి గెంటేశాడు.