తను హీరోగా తెరకెక్కిన  అర్జున్‌ సురవరం సినిమా రిలీజ్ అయ్యి...హిట్టో..ప్లాఫ్ తేలిపోతే బాగుండును అని యంగ్ హీరో నిఖిల్ ఎదురుచూస్తున్నాడు. కానీ ఆ టైమ్ వచ్చేటట్లు కనపడటం లేదు. కనపడినవాళ్లు, సోషల్ మీడియాలో జనం ..నీ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నప్పడుల్లా ఇబ్బంది ఫీలవుతున్నాడు. తమవైపు నుంచి సమస్య లేకపోయినా టైటిల్ రెండు సార్లు మార్చాల్సి రావటం, రిలీజ్ డేట్ ఐదు సార్లు మార్చటంతో సినిమాపై క్రేజ్ పూర్తిగా  పోయింది. దాంతో నిఖిల్ ఫలానా తేదీ రిలీజ్ అని చెప్పినా నమ్మే పరిస్దితి లేదు. డబ్బు పెట్టి డిస్ట్రిబ్యూటర్స్ కొని రిలీజ్ చేసే  పరిస్దితి అంతకన్నా లేదు. 

మరో ప్రక్క చిత్రయూనిట్ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించి,అర్దాంతరంగా ఆపేసారు. ఆ మధ్యన రిలీజ్ అవుతుందనుకుంటే...'అవెంజర్స్‌ - ఎండ్‌ గేమ్‌' దెబ్బకు 'అర్జున్‌ సురవరం' నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అర్ధాంతరంగా ఈ సినిమాని వాయిదా వేసేశారు. అప్పటి నుండీ ఇప్పటి వరకూ పాపం నిఖిల్‌కి సరైన రిలీజ్‌ స్లాట్‌ దొరకలేదు.

ఈ సినిమాని జనం మర్చిపోయారు కూడా. అయితే, తాజాగా 'అర్జున్‌ సురవరం' రిలీజ్‌ డేట్‌ గురించి సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఆ క్రమంలోనే నిఖిల్‌ని ఓ అభిమాని.. 'అన్నా నీ సినిమా విడుదల ఎప్పుడు? అని ప్రశ్నించగా, 'పెద్దన్న 'సాహో' సినిమా వచ్చాకే మన సినిమా..' అని చిన్న హింట్‌ ఇచ్చాడు. ఆగస్ట్‌ చివర్లో 'సాహో' విడుదల కానుంది. అంటే సెప్టెంబర్‌ కానీ, అక్టోబర్‌ కానీ, నిఖిల్‌ సినిమా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అప్పట్లో నూ మహర్షి రిలీజ్‌ తరువాత అర్జున్‌ సురవరం రిలీజ్‌ అవుతుందని తెలిపారు. కానీ కాలేదు. దాంతో ఈ సారి అయినా ఉంటుందా అంటున్నారు. 

ఇది నాకు బాధాకరం అయినప్పటికీ డబ్బులు పెట్టి కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. వారిచ్చే మరో గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం మీలాగే నేను వేచిచూస్తున్నా. ఇలాంటి సమయంలో మీ తోడ్పాటు నాకు అత్యవసరం.. ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నాను.. మీ నిఖిల్’అన్నారు నిఖిల్.  నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్‌ హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కించారు.