యాక్షన్‌ స్టార్‌గా రాణిస్తున్న అర్జున్‌.. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇప్పుడు ఆయన `లియో` మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఇందులోని ఆయన పాత్రని పరిచయం చేశారు.

ఈ ఏడాది రాబోతున్న చిత్రాల్లో మంచి అంచనాలున్న మూవీ `లియో`. `విక్రమ్‌` సినిమాతో సంచలనాలు క్రియేట్‌ చేసిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ నుంచి వస్తోన్న మూవీ ఇది. ఇందులో ధళపతి విజయ్‌ హీరోగా నటిస్తుండటం విశేషం. దీంతో ఈ సినిమాపై తమిళంలోనే కాదు, తెలుగు వంటి ఇతర భాషల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ దసరా కానుకగా విడుదల కాబోతుంది. తెలుగులోనూ రిలీజ్‌ కానుంది. 

ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఒక్కో అప్‌డేట్‌ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు. సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇటీవల నెగటివ్‌ రోల్‌ చేస్తున్న సంజయ్‌ దత్‌ పాత్రని పరిచయం చేశారు. తాజాగా యాక్షన్‌ స్టార్‌ అర్జున్‌ పాత్రని పరిచయం చేశారు. ఇందులో ఆయన హరోల్డ్ దాస్‌ అనే పాత్రలో కనిపించబోతున్నారట. నేడు అర్జున్‌ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. దీంతో ఆయన పాత్ర గ్లింప్స్ ని పంచుకున్నారు. ఇందులో అత్యంత భయంకరమైన విలన్‌ పాత్రలో అర్జున్‌ కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన నెగటివ్‌ రోల్స్ లో ఇదే క్రూరమైన రోల్‌ అని అనిపించేలా ఆయన పాత్ర సాగడం విశేషం. 

కారులో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఓ పెద్ద గ్యారేజీలో వందల మంది మధ్య ఒకడిని చేతిని నరికేస్తాడు. రక్తం మొత్తం మీద కారిపోతుండగా సిగరేట్‌ తాగుతూ అర్జున్‌ ఇచ్చిన లుక్‌ వాహ్‌ అనేలా ఉంది. గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. అదే సమయంలో చివరల్లో ఆయన `తెరి.... `అంటూ చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది. అయితే ఇందులోని అర్జున్‌ రోల్‌ చూడబోతుంటే.. `విక్రమ్‌`లోని రోలెక్స్ పాత్రని గుర్తు చేస్తుండటం విశేషం. అందులోనూ సూర్య కారులో వచ్చి తనని `సర్‌` అని పిలవనందుకు ఒకడి తల నరికేస్తాడు. కాల్‌ మీ సర్‌ అంటూ హెచ్చరిస్తాడు. `విక్రమ్‌`ని పట్టిస్తే లైఫ్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ అంటూ ఆఫర్‌ ఇస్తాడు. ఈ సందర్భంలోనూ సూర్య మొత్తం రక్తం కారుతుండగా సిగరేట్‌ తాగుతూ ఇచ్చే స్మైల్‌ వాహ్‌ అనేలా ఉంటుంది. ఇప్పుడు `లియో`లోనూ అర్జున్‌ పాత్ర అలానే ఉండటంతో దానికి దీనికి లింక్‌ ఉంటుందా? అనే ఆసక్తి ఏర్పడింది. 

YouTube video player

విజయ్‌ హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీలో త్రిష కథానాయికగా నటిస్తుంది. సంజయ్‌ దత్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఆయనతోపాటు అర్జున్‌ కూడా మరో విలన్‌ పాత్రలో రూత్‌లెస్‌ విలన్‌గా కనిపించబోతున్నారని తెలుస్తుంది. సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్‌ కుమార్ నిర్మిస్తున్న చిత్రమిది. దసరా కానుకగా అక్టోబర్‌ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది.