Asianet News TeluguAsianet News Telugu

కొత్త సీన్లతో ‘అర్జున్ రెడ్డి’ రీ రిలీజ్.. డేట్ ఎప్పుడంటే!

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఎన్నో వివాదాలు సృష్టించటంతో పాటు అదే స్థాయిలో విజయం కూడా సాధించింది. ఈ సినిమాని చూసిన వాళ్లు మర్చిపోవటం కష్టమే. అయితే ఈ సినిమాలో చాలా సీన్స్ లెంగ్త్ ఎక్కువైందని కట్ చేసేసారు. వాటిని కలుపుతూ రీరిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

Arjun Reddy Will Be Released Once Again
Author
Hyderabad, First Published Aug 26, 2020, 12:46 PM IST

‘అర్జున్ రెడ్డి’  తెలుగు సినిమా బాక్సాఫీసులను బద్దలు చేసిన చిత్రం. విజయ్ దేవరకొండను కెరీర్ పరంగా ఎక్కడికో తీసుకెళ్లిన సినిమా అది. సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాను డిఫరెంట్ కథగా  తెరకెక్కించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేసారు. హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తే అక్కడా ఘన విజయం సాధించింది. అదే సమయంలో అనేక వివాదాలు సైతం ఈ సినిమా మోసుకొచ్చింది.  ఇక అర్జున్‌ రెడ్డి విడుదలై సరిగ్గా మూడేళ్లవుతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రీరిలీజ్ చేయాలనే ఆలోచనను చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి వంగా.

 డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...ఈ సినిమా 4.20 నిమిషాల నిడివితో ఉండేలా తెరకెక్కించామని, తప్పనిసరి పరిస్థితిల్లో కొన్ని కొన్ని సీన్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఫైనల్‌గా 3.45 నిమిషాల నిడివి గల సినిమాను రెడీ చేసుకున్నామని చెప్పారు.  కానీ, కొన్ని కారణాల వల్ల చివరికి 3.06గంటల నిడివి ఉన్న  సీనిమాను మాత్రమే విడుదల చేశామని చెప్పారు. 3.45గంటల నిడివితో విడుదల చేస్తే మరింత హిట్‌ సాధించేదని చెప్పుకొచ్చారు.

అలాగే కట్‌ చేసిన సీన్లతో మొత్తం 3.45 నిమిషాల నిడివి గల సినిమాను ఐదేళ్లు పూర్తయ్యే సందర్భంగా 2022 ఆగస్ట్‌ 25న విడుద చేయాలని ప్లాన్‌ చేసుకున్నామని సందీప్‌ రెడ్డి తెలిపారు. అందులో చాలా ఫన్నీ సీన్లు కూడా ఉన్నాయట. శివ, కమల్‌, విద్య, కీర్తి ఎలా క్లోజ్‌ అయ్యారు, అర్జున్‌ రెడ్డి స్కూల్‌ ప్రెండ్స్‌.. అతని బాల్యం, బుల్లెట్‌ బైక్‌ సంబంధించిన సీన్లు కొత్తగా విడుదల చేయబోయే సినిమాలో ఉంటాయట. అలాగే అర్జున్‌ రెడ్డి పెంచుకున్న కుక్కకు సంబంధించిన కామెడీ సీన్‌ కూడా ఉండబోతుదని చెప్పారు. అయితే రిలీజ్ డేటే మరో రెండేళ్లు తర్వాత అనేది అభిమానులకు కాస్తంత ఇబ్బందికరమైన అంశం.

Follow Us:
Download App:
  • android
  • ios