టాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. హిందీలో 'కబీర్ సింగ్' అనే పేరుతో రూపొందుతోన్న సినిమాలో షాహిద్ కపూర్ నటిస్తుండగా, తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కొడుకు దృవ్ నటిస్తున్నాడు.

ఈ సినిమాకి 'వర్మ' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తున్నంత సేపు కథలో సోల్ మిస్ అయిందనే ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతోంది. తెలుగు వెర్షన్ లో ఉన్న సన్నివేశాలన్నీ తమిళ ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు. 

డైలాగ్స్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ ని కట్ చేశారు. హీరో దృవ్ కోపం, ఎమోషన్ అన్నీ పలికిస్తున్న ఒరిజినల్ వెర్షన్ ని తలదన్నే మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోయాడు. పైగా అతడి మేనరిజమ్స్ కూడా సెట్ అయినట్లుగా అనిపించడం లేదు.

ట్రైలర్ అయితే అంత ప్రభావం చూపలేకపోయింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.. బాల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మేఘా చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది!