Asianet News TeluguAsianet News Telugu

అర్జున్ రెడ్డి రీమేక్: బాబోయ్ ఎన్నిసార్లు ఈ రచ్చ?

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అర్జున్ రెడ్డి కోలీవుడ్ లో ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో గాని సినిమా షూటింగ్ దశలోనే ఆపసోపాలు పడుతోంది. ప్లానింగ్ లేకుండా రీమేక్ హక్కులతో హడావుడి చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. మొత్తానికి డైరెక్టర్ బాలాని అలాగే హీరోయిన్ ని తప్పించేశారు. విక్రమ్ తనయుడు ధృవ్ ఎంతవరకు అర్జున్ రెడ్డి పాత్రకు న్యాయం చేస్తాడో గాని నెటిజన్స్ ముందే ట్రోల్ చేయడం మొదలెట్టారు. 

arjun reddy remake latest update
Author
Hyderabad, First Published Feb 19, 2019, 8:17 PM IST

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అర్జున్ రెడ్డి కోలీవుడ్ లో ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో గాని సినిమా షూటింగ్ దశలోనే ఆపసోపాలు పడుతోంది. ప్లానింగ్ లేకుండా రీమేక్ హక్కులతో హడావుడి చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. మొత్తానికి డైరెక్టర్ బాలాని అలాగే హీరోయిన్ ని తప్పించేశారు. విక్రమ్ తనయుడు ధృవ్ ఎంతవరకు అర్జున్ రెడ్డి పాత్రకు న్యాయం చేస్తాడో గాని నెటిజన్స్ ముందే ట్రోల్ చేయడం మొదలెట్టారు. 

ముందుగా ఈ రీమేక్ కు వర్మ అని టైటిల్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆదిత్య వర్మ అంటూ సేమ్ అర్జున్ రెడ్డి స్టైల్ లో  కొత్త పోస్టర్ ని వదిలారు. ఆ లుక్ లో ధృవ్ ఏ మాత్రం సెట్టవ్వలేదని ఈ ఫస్ట్ లుక్స్ తో ఎన్నిసార్లు రచ్చ చేస్తారని ఆడియెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిర్మాతలు సినిమా టీమ్ ను మొత్తం చేంజ్ చేశారు. 

కెమెరామెన్ ను కూడా తప్పించి సీనియర్ సినిమాటోగ్రాఫర్ కెయస్.రవిచంద్రన్ ని ఫిక్స్ చేశారు. అనుకున్నట్టుగానే అర్జున్ రెడ్డి సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్న గిరీశయ్యకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి అర్జున్ రెడ్డి సంగీత దర్శకుడైన రధన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫైనల్ గా ఎదో కొత్త సినిమా అంటూ ఫ్రెష్ గా మొదలెడుతున్నప్పటికీ సినిమాపై జనాలు అంతగా ఆసక్తి చూపడం లేదు. మరి ఈ సినిమా కథకు ధృవ్ ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios