టాలీవుడ్ సెన్సేషనల్ మూవీ అర్జున్ రెడ్డి. ఇంకా సంచలనాలను కంటిన్యూ చేస్తూనే ఉంది. రెండో వీకెండ్ లో ఈ చిత్రం కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ సెట్ చేసే మాదిరిగానే కనిపిస్తోంది. మూవీలో కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండడం.. మౌత్ టాక్ కూడా బాగుండడానికి తోడు. కొత్త కొత్త వివాదాలు వసూళ్లు మరింతగా పెరిగేందుకు హెల్ప్ అవుతున్నాయి.

 

అర్జున్ రెడ్డిని ఇతర భాషల్లో నిర్మించేందుకు ఇప్పటికే బోలెడంత పోటీ ఉందనే సంగతి తెలుస్తూనే ఉంది. ఇప్పటివరకూ సౌత్ లోనే కాదు.. బహుశా ఇండియన్ స్క్రీన్ పైనే చూడనటువంటి కొత్త తరహా హీరో కేరక్టరైజేషన్ కావడంతోనే ఇంతటి పోటీ అని చెప్పవచ్చు. అలాగే సినిమా కూడా కుర్రాళ్లను ఆకట్టుకునే కంటెంట్ కావడంతో ఈ పోటీ మరింతగా ఎక్కువగా ఉంది.

 

 ఇప్పుడు అర్జున్ రెడ్డిని తమిళ్ లో రీమేక్ చేసేందుకు గాను రైట్స్ సేల్ చేశారని తెలుస్తోంది. తమిళ్ హీరో ధనుష్ కు చెందిన వండర్ బార్ ఫిలిమ్స్.. అర్జున్ రెడ్డి తమిళ హక్కులను సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.ఈ రీమేక్ లో నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ధనుష్ నటిస్తాడా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు.

 

వేరే హీరోతో ధనుష్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ ఉన్నా.. అర్జున్ రెడ్డి పాత్రపై ధనుష్ చాలా మనసు పడ్డాడని.. ఈ హీరోనే నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద అర్జున్ రెడ్డి తమిళ్ లోకి వెళ్లడం అయితే మాత్రం ఖాయమైంది.