లవర్ కళ్లదురుగా ఉందామని 23 కోట్లు ఖర్చుపెట్టి...

ఒక హాలు, వంటగది, బాల్కనీతో పాటు నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్న ఈ స్కై విల్లాను 20 నుంచి 23 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ​ అంత రేటు పెట్టి విల్లాని కొన్నారని తెలిసే సరికి అందరూ షాక్ అవుతున్నారు.

Arjun Kapoor Is Malaikas Neighbour, Buys 20 Cr Flat jsp

బాలీవుడ్ లవ్‌బర్డ్స్‌ మలైకా అరోరా-అర్జున్‌ కపూర్ల గురించి అందరికీ తెలుసు. మీడియాకు కూడా అది చాలా ఓల్డ్ న్యూస్ అయ్యిపోయింది. వీళ్ళిద్దరూ...  అంతగా ఈ జంట బి-టౌన్‌లో చక్కర్లు కొడుతున్నారు. కొంతకాలం సిక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న వీరు ఏడాది క్రితమే వారి రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు.  మలైకా, అర్జున్‌ కంటే 12 ఏళ్లు పెద్దది. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌తో మలైకా విడాకులు తీసుకుని విడిపోయింది. అనంతరం అర్జున్‌తో ప్రేమ వ్యవహారన్ని కొనసాగిస్తోంది.  

ఈ నేపధ్యంలో  ఏకంగా మలైకా ఇంటికి సమీపంలోనే ఓ ఖరీదైన విల్లా కొనుగోలు చేశాడు అర్జున్. సెలబ్రిటీల నివాసాలకు నిలయమైన ముంబైలోని బాంద్రాలో అర్జున్‌ ఓ విలాసవంతమైన విల్లాను తన సొంతం చేసుకున్నాడు.ఒక హాలు, వంటగది, బాల్కనీతో పాటు నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్న ఈ స్కై విల్లాను 20 నుంచి 23 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ​ అంత రేటు పెట్టి విల్లాని కొన్నారని తెలిసే సరికి అందరూ షాక్ అవుతున్నారు.మామూలుగా వీళ్లిద్దరూ కలిసి ఎన్నో పార్టీలు చేసుకోవడమే కాక ఏ కార్యక్రమమైనా కలిసే వెళ్లూంటారు. అయితే ప్రస్తుతం కరోనాతో కాస్తంత బయిట తిరగటం తగ్గించుకున్నారు. ఈసారి మాత్రం వీళ్లు ఎక్కడెక్కడో బయట తిరగకుండా ప్రక్కప్రక్కనే కాబట్టి ఇబ్బంది లేకుండా గడపచ్చు అంటోంది బాలీవుడ్ మీడియా. 

అర్జున్‌ నటించిన ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ మూవీ నెట్‌ఫ్లీక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో నీనా గుప్తా కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం అర్జున్‌ నటిస్తున్న భూట్‌ పోలీసులో సైఫ్‌ అలీ ఖాన్‌, జాక్వేలిన్‌ ఫెర్నాడేజ్‌, యామి గౌతమ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios