బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న అరియనా గ్లోరీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. హౌస్ లో తన ముక్కుసూటి తనం, బోల్డ్ యాటిట్యూడ్ తో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచింది. ఫైనల్ కి చేరుకున్న ఆరియానా నాలుగవ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఒక దశలో టైటిల్ విన్నర్ అని కూడా వినిపించింది. 

 

ఇక బిగ్ బాస్ తో భారీగా అభిమానులను సొంతం చేసుకున్న అరియనా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. యాంకర్ బిత్తిరి సత్తి అరియనాను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఆమెను పలు ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు. జనవరిలో నీ బర్త్ డే బిగ్ బాస్ దోస్తులకు పార్టీ ఇస్తున్నావా అని అడిగారు. దానికి అరియనా... డబ్బులు ఉంటే ఇస్తాను అన్నారు. 

 

నీవు అడిగితే అనేక మంది స్పాన్సర్ చేస్తారని బిత్తిరి సత్తి అన్నారు. ఎవరో ఎందుకు నేనే స్పాన్సర్ చేస్తా, మటన్ తెప్పించి దావత్ ఇస్తా అన్నాడు. అయితే సోహెల్ కోసం కల్లు కూడా తెప్పించాలని అరియనా అన్నారు. సత్తి అన్ని తెప్పిస్తాను అని సత్తి అన్నారు. ఇక వచ్చే ఏడాదే పెళ్లి చేసుకొని పిల్లలు కంటా అని అరియనా షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.