బిగ్ బాస్ ఇంటిలో ఆరియానా ఒకవైపు మిగతా సభ్యులు ఒకవైపు అన్నట్లు తయారైంది పరిస్థితి. కెప్టెన్ గా ఎంపికైన ఆరియానా స్ట్రిక్ట్ రూల్స్ తో, చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బంది పెట్టిందని అందరి ఆరోపణ. ఇదే కారణం చూపుతూ హౌస్ లోని అందరు ఆరియానాను నామినేట్ చేశారు. ఇంటిలో మొత్తం ఆరియానా కాకుండా ఎనిమిది మంది ఉన్నారు. ఈ ఎనిమిది మంది హౌస్ మేట్స్ నుండి ఏడుగురు ఆరియానాను నామినేట్ చేయడంతో, ఆమె పట్ల వారు ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో అర్థం అయ్యింది. ఒక్క అవినాష్ మినహా హౌస్ లోని వారందరు ఆరియానాను నామినేట్ చేయడం జరిగింది. 

ఒక సాధారణ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటరైన ఆరియనా ముక్కుసూటి తనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, టాస్క్ లో గట్టి పోటీ ఇస్తూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యారు. సమంత వంటి స్టార్ కూడా ఆరియానాలో తనని తాను చూసుకున్నట్లు చెప్పడం విశేషం. హౌస్ నుండి బయటికి వచ్చిన నోయల్ సైతం ఆరియానా హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్ అని ఒప్పుకున్నారు. 

సేఫ్ గేమ్ కి దూరంగా ఉంటున్న ఆరియానాకు హౌస్ లో శత్రువులు ఎక్కువయ్యారు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కూడా ఇదే తరహా ఆట తీరును కనబరచడం విశేషం. హౌస్ మేట్స్ ఎంతగా విమర్శించినా కౌశల్ పట్టించుకొనే వాడు కాదు. హౌస్ లో గేమ్ ఈజ్ గేమ్ అన్నట్లు ఉండేవాడు. నో ఎమోషన్స్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండేవాడు. ఆ సీజన్లో కూడా కౌశల్ ఒకవైపు ఇంటి సభ్యులు మరోవైపు అన్నట్లు ఉండేది. ప్రతిసారి కౌశల్ నామినేట్ కావడం జరిగేది. ఇంటిలో కౌశల్ కి ఒకరిద్దరు మిత్రులు మాత్రమే ఉండేవారు. 

ప్రస్తుత ఆరియానా పరిస్థితి అలానే ఉంది. అవినాష్ మినహా ఆరియానాకు హౌస్ లో మిత్రులు లేరు. ఆమెతో క్లోజ్ గా ఉండే అమ్మ రాజశేఖర్ కూడా ఎలిమినేట్ కావడంతో ఆమె ఒంటరిగా ఫీలవుతున్నారు. మరి ముందు ముందు ఆరియనా కఠిన టాస్క్ లు,ఇంటి సభ్యుల వ్యతిరేకత ఎదుర్కొని ఎలా నిలబడుతుందో చూడాలి. ఇక ఈ వారానికి గానూ అభిజిత్, ఆరియానా, మోనాల్, హారిక, సోహైల్, మెహబూబ్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.