బిగ్ బాస్ హౌస్ లో మంచిమిత్రలుగా ఉంటున్నారు అవినాష్, అరియానా. ఇంటిలో మిగతా సభ్యులు వారితో కలిసినా, కలవకపోయినా ఈ ఇద్దరు జట్టుగా ఉండేవారు. అమ్మ రాజశేఖర్ ఉన్నప్పటి నుండి హౌస్ లో వీరి మధ్య మంచి బాండింగ్ కొనసాగుతుంది. టాస్క్ లు మరియు నామినేషన్స్ లో వీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. 

కాగా ఈ మధ్య అవినాష్ చిన్న చిన్న విషయాలకు కూడా అరియనాపై కోప్పడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం కిచెన్ లో అరియనా ఎదో బాధ్యత గురించి మాట్లాడినందుకు ఆమెపై చాలా సీరియస్ అయ్యాడు. నీ మాటలు బయట నన్ను బ్యాడ్ చేస్తాయని అరిచాడు. చిన్న విషయాన్ని ఎందుకు పెద్దది చేస్తావ్ అని అరియనా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత అవినాష్ అరియనాను కూల్ చేశాడు. 


ఇక నేటి ఎపిసోడ్ లో కూడా అవినాష్ అరియానా పై కోప్పడ్డాడు. అభిజిత్, అరియనా మధ్య అవినాష్ ప్రస్తావన రావడం జరిగింది. వాళ్లిద్దరూ మాట్లాడుకున్నది విన్న అవినాష్, అరియనా నా గురించి మాట్లాడ వద్దని మరలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తప్పు చేయకపోయినా టార్గెట్ చేస్తున్న అవినాష్ తీరుకు అరియనా తల సోఫాకి గుద్దుకుంది. అరియనా తీరుకు ఇంటి సభ్యులు కూడా షాక్ అయ్యారు. అభిమానించే అవినాష్ తనతో ప్రవర్తిస్తున్న తీరుకు అరియనా బాగా హర్ట్ అయ్యింది.