అల్లు శిరీష్ తాజాగా ఎబిసిడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ చిత్ర ప్రచారం కార్యక్రమాల్లో శిరీష్ బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో శిరీష్ కు మీడియా నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు శిరీష్ నవ్వేశాడు. చరణ్. బన్నీ గురించి వస్తున్న రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేశాడు. 

గత కొంతకాలంగా బన్నీ, చరణ్ సరిగా మాట్లాడుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి.. ఎందుకు అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. శిరీష్ వెంటనే నవ్వేశాడు. ఇదొక హాస్యాస్పదమైన రూమర్. అలాంటిది ఏమి లేదు. రాంచరణ్, అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి కలసి పెరిగారు. తరచుగా వారిద్దరూ కలుసుకుంటూ వివిధ అంశాల గురించి మాట్లాడుకుంటుంటారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం ఇలాంటి పుకార్లు సృష్టిస్తుంటాయి అని శిరీష్ బదులిచ్చాడు. 

చరణ్, బన్నీపై వస్తున్న రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చాక శిరీష్ జనసేన పార్టీ గురించి కూడా ప్రస్తావించాడు. జనసేన పార్టీకి తన మద్దత్తు ఎప్పుడూ ఉంటుందని తెలిపాడు. తన సోదరుడు అల్లు అర్జున్ స్వయంగా పవన్ కళ్యాణ్ ని కలసి మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.