యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథనాయికుడిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమాను
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథనాయికుడిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ముందుగా విడుదల చేసింది.
ఇందులో ఎన్టీఅర్ సిక్స్ ప్యాక్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. 'అరవింద సమేత.. వీర రాఘవ' అనే టైటిల్ ను సినిమాకు కన్ఫర్మ్ చేశారు. ఈరోజు సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఇందులో ఎన్టీఆర్ అలానే హీరోయిన్ పూజాహేగ్దే ఓ గట్టున కూర్చొని ఒకరినొకరు చూసుకుకుంటూ ఉండడంనెటిజన్లను ఆకట్టుకుంటోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయనున్నారు.
Scroll to load tweet…
