'అరవింద సమేత' టీజర్ డైలాగ్ లీక్.. అరవింద అనాధ కాదు.. తోడుగా ఈ రాఘవ వీర రాఘవ ఉన్నాడు..

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 14, Aug 2018, 2:23 PM IST
aravinda sametha movie teaser dialogues leaked
Highlights

అరవింద అనాధ కాదు.. తోడుగా ఈ రాఘవ వీర రాఘవ ఉన్నాడు..  ఇప్పుడు ముట్టుకో.

ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తోన్న చిత్రం 'అరవింద సమేత'. అక్టోబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆగస్టు 15న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ టీజర్ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోతుంది.

అయితే దీనికి సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. టీజర్ దాదాపు ఒక నిమిషం నాలుగు సెకన్లు ఉంటుందని సమాచారం. టీజర్ లో ఎన్టీఆర్ కు రెండు డైలాగులు, జగపతిబాబుకి ఒక డైలాగ్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. 'అరవింద అనాధ కాదు.. తోడుగా ఈ రాఘవ వీర రాఘవ ఉన్నాడు..  ఇప్పుడు ముట్టుకో..' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుందట.

టీజర్ మొత్తానికి ఈ డైలాగ్ హైలైట్ గా నిలుస్తుందని టాక్. జగపతిబాబు విలన్ గా కనిపించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. 

 

loader