Asianet News TeluguAsianet News Telugu

హిందీ పాటలు పాడి కూడా సంపాదిస్తున్నావ్ గా.. ఏఆర్ రెహమాన్ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఎందుకంటే..?

స్టార్ మ్యూజిక్ డైరెక్ట్ ఏఆర్ రెహమాన్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఆయన తన భార్యకు ఇచ్చిన ఓ సలహా తనను విమర్షలకు గురి చేసింది. ఇంతకీ ఆయన ఏం చేశారు. ఎందకు నెటిజన్లు మండిపడుతున్నారంటే..?  

AR Rahman Trolled For Telling Her Wife To Speak In Tamil JMS
Author
First Published Apr 27, 2023, 9:12 AM IST

సాధారణ గిటార్ ప్లేయర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. దాదాపు మూడు దశాబ్ధాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నాడు  ఏఆర్ రెహమాన్. తెలుగు,తమిళ, కన్నడ,హిందీ , ఇంగ్లీష్ భాషల్లో వేల పాటలకు ఆయన ప్రాణం పోశారు. అంతే కాదు మ్యూజిక్ లో ఇండియా నుంచి రెండు ఆస్కార్ లు అందుకున్న ఘనత కూడా ఆయనదే. ఏదైనా సినిమాకు ఆయన మ్యూజిక్ చేయడానికి ఒప్పుకున్నాడు అంటే.. ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టే. అంతలా రెహమాన్ మ్యూజిక్ కు జనాలు అలవాటు పడ్డారు. ఇంకా రెండు మూడు తరాలు విని ఎంజాయ్ చేసేలా అద్భుతమైన పాటలను  సృష్టించారు రెహమాన్. ఇక ఈమధ్య ఇండస్ట్రీకి కొత్త మ్యూజిక్ డైరెకక్టర్లు వచ్చి.. తమ టాలెంట్ చూపించడంతో.. రెహమాన్ కాస్త వెనకబడ్డారు. 

అయితే రెహమాన్ తమిళ ఇండస్ట్రీకి చెందినవారు కావడం.. తమిళంపై ఆయనకు మక్కువ ఎక్కువ. తమిళనాట భాషాప్రేమికులు కాస్త ఎక్కువన్న విషయం తెలిసిందే. అది ఆయనలో కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ముస్లిమ్ గా కన్వర్ట్ అయిన రెహమాన్.. బయట తమిళ్ మాట్లాడటానికే ఇష్టపడతారు. ఇక ఆయన మ్యూజిక్ విషయం విశ్వవ్యాప్తం. అన్ని భాషల్లో సినిమాలు చేశారు.. అన్ని భాషల్ల్ పాడారు... రికార్డ్స్ బ్రేక్ చేశారు కూడా. ఇక తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాకు మ్యూజిక్ చేసి మెప్పించారు రెహమాన్. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ కు పనిచేశారు. ఈమూవీ ఈనెల 28న రిలీజ్ కాబోతోంది. దాంతో టీమ్ తో కలిసి  ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు రెహమాన్  

తాజాగా పొన్నియిన్ సెల్వన్ కు సంబంధించిన ఓఈవెంట్ జరిగింది. ఈ వెంట్ రెహమాన్ భార్య కూడా పాల్లోన్నారు.ఇందులో ఆమె మాట్లాడటానికి రెడీ అవుతుండగా తమిళ్ లో మాట్లాడాలని రెహమాన్ ఆమెకు చెప్పారు. .అయితే  తనకు తమిళ్ మాట్లాడటానికి స్పీడ్ గా రాదు అని ఇంగ్లీష్ లో మాట్లాడారు సైరభాను. తన భర్త వాయిస్ అంటే తనకు ఇష్టమని.. తన గాత్రం విని తాను ప్రేమలో పడిపోయాను అన్నారు సైరభాను. . తన పాట అంటే తనకు ఎంతో ఇష్టం అన్నారు సైర బాను. ఇక ఇది ఇలా ఉంటే.. ఆడియన్స్ మాత్రం రెహమాన్ ను గట్టిగా విమర్షిస్తున్నారు. 

 

 

తమిళంలో మాట్లాడమని తన భార్యతో అనడం నెటిజన్లకు నచ్చలేదు. ఎవరికైనా తమకు కంఫర్ట్ గా ఉండే భాషలోనే మాట్లాడుతారు.. తమిళ్ మీద మీకు అభిమానం ఉండొచ్చు.... కాని తన భార్య ఏం మాట్టాడలి అన్నది కూడా తానే డిసైడ్ చేయడం మంచి పద్దతి కాదు అన్నారు. అంతే కాదు.. మీరు తమిళంలోనే పాడి డబ్బులు సంపాదించడం లేదు కదా..  హిందీ పాటలు కూడా పాడుతున్నారు కదా.. మరి అలాంటప్పుడు ఇతర భాషలు మాట్లాడటానికి పనికిరావడంలేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. భాషలు వేరు కావచ్చు..మనం అంతా ఇండియన్స్ అని గుర్తుంచుకోండి అంటూ.. చురకలు అంటిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios