ప్రభాస్, షారూఖ్ లకు ‘ఆక్వామెన్’ట్విస్ట్ ,ఇదేంటి రాజా?
ఈ మెగా క్లాష్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఊహించని విధంగా #Aquaman ఆక్వామెన్ రిలీజ్ ని డిసెంబర్ 22 కు పెట్టుకుంది.

పెద్ద సినిమాలు రిలీజ్ అంటే థియేటర్స్ సమస్య లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మాగ్జిమం థియేటర్స్ తమ సినిమాకే కావాలని పెద్ద హీరోల దర్శక,నిర్మాతలు కోరుకుంటారు. భారీ బడ్జెట్ లు రికవరీ కావాలంటే అవసరం కూడా. అయితే ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా ఏదో ఒక సినిమా సమస్యగా మారిపోతుంది. ఓ ప్రక్కన షారూఖ్, ప్రభాస్ ఒకే టైమ్ లో తమ భారీ చిత్రాలను రంగంలోకి దించుతున్నారు. అప్పటికీ షారూఖ్ తన డంకీ రిలీజ్ డేట్ ని ఓ రోజు ముందుకు తీసుకొచ్చి..మొదటి రోజు ఓపినింగ్స్ కు ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.
సలార్, డంకీ.. ఇప్పుడు ఇండియన్ సినిమా అభిమానుల కళ్లన్నీ ఈ రెండు సినిమాలపైనే ఉన్నాయి. ఈ రెండు మెగా మూవీస్ ఒకే రోజు తేడాలో రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ ఫైట్ తప్పేలా కనిపించడం లేదు. ఈ సందర్భంగా ఈ మెగా క్లాష్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఊహించని విధంగా #Aquaman ఆక్వామెన్ రిలీజ్ ని డిసెంబర్ 22 కు పెట్టుకుంది. డిసెంబర్ 21 న ప్రీ షోస్ పడేలా షెడ్యూల్ జరగింది. ఖచ్చితంగా డంకీ , సలార్ లపై ఈ ఎఫెక్ట్ పడుతుందంటున్నారు.
డిసెంబర్ 22 న ఆక్వామెన్ లాస్ట్ కింగ్ డం భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ లో విజువల్స్ అదిరిపోయాయి. ఇది చూసిన తర్వాత మరో విజువల్ వండర్ మూవీ అనక తప్పదు. ట్రైలర్‌ను అద్భుతమైన విజువల్స్‌తో కట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాలనిపించేలా ఉంది. అయితే తెలుగులో ఆక్వామేన్ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోయినా.. ఓవర్సీస్‌లో మాత్రం ఆక్వామెన్ వల్ల థియేటర్ల కొరత ఖచ్చితంగా ఉంటుంది. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫస్ట్ ప్రయార్టి ఇంగ్లీష్ సినిమాలకే ఉంటుంది. కాబట్టి ప్రీమియం స్క్రీన్లన్నీ ఆక్వామేన్ కబ్జా చేసేస్తుంది. అలాగే మనకు ఇక్కడ మల్టిప్లెక్స్ లలో ఆ సినిమా భారీ రిలీజ్ ఉంటుంది. ఇంతకు ముందు స్పైడర్ మ్యాన్ తాకిడిని తట్టుకుని పుష్ప 1 విజయం సాధించింది. కానీ అప్పటి పరిస్దితి వేరు. స్పెడర్ మ్యాన్ రిలీజయ్యే టైంలో దాని మీద మితిమీరిన హైప్ లేదు.ఏదైమైనా ఆక్వామెన్ ని మాత్రం సలార్ , డంకీ సీరియస్ గా తీసుకోక తప్పదంటోంది ట్రేడ్.
జాసన్ మోమోవా హీరోగా జేమ్స్ వాన్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రం ‘ఆక్వామెన్’. 2018లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 141.14 బిలియన్ డాలర్లు వసూలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘ఆక్వామెన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్’ని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ప్రముఖ నిర్మాణ సంస్థ డీసీ కామిక్స్. దీనికీ జేమ్స్ వాన్‌నే దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. జాసన్ ఈ సీక్వెల్‌లోనూ ఆర్థర్ కర్రీ అనే పాత్రలోనే సందడి చేయనున్నారు.
ఏదైమైనా హాలీడే సీజన్ లో మూడు పెద్ద సినిమాలు, ముగ్గురు పెద్ద ఫిల్మ్ మేకర్స్, ముగ్గురు పెద్ద హీరోలు తలపడబోతున్నారు. ఈ మూడు సినిమాల కథ, కథనాలు పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి