Asianet News TeluguAsianet News Telugu

మొన్న పోకిరి నిన్న బాహుబలి 2... రేపు SSMB 28!


మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఆయన లేటెస్ట్ మూవీపై ఎపిక్ అప్డేట్ రావడమే దీనికి కారణం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ssmb 28 రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించగా... ఆ డేట్ కి ఓ ఘనమైన చరిత్ర ఉంది. 

April 28 has unique history ssmb 28 reserves same date
Author
First Published Aug 19, 2022, 8:39 AM IST

నిన్న మహేష్(Mahesh Babu) ఫ్యాన్స్ కి ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. SSMB 28 విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ పై ఎటువంటి అప్డేట్ రావడం లేదని, మూవీ సెట్స్ పైకి వెళ్లడం లేదని ఫ్యాన్స్ లో ఉన్న అసహనం మొత్తం ఎగిరిపోయింది. ఏప్రిల్ 28న మహేష్-త్రివిక్రమ్ మూవీ విడుదల కానున్నట్లు యూనిట్ ప్రకటించారు. అంటే కేవలం మరో ఎనిమిది నెలల్లో మహేష్ నుండి మూవీ రానుందన్న మాట.
 
కాగా ఏప్రిల్ 28వ తేదీకి ఘనమైన చరిత్ర ఉంది. పోకిరి, బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఈ తేదీన విడుదలయ్యాయి. అదే తేదీన SSMB  28 విడుదల కావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా 2006 ఏప్రిల్ 28న పోకిరి విడుదలైంది. టాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసిన ఈ చిత్రం మహేష్ కెరీర్ బెస్ట్  మూవీగా నిలిచింది. ఇప్పటికీ పోకిరి అంటే మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు కలుగుతాయి. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల పోకిరి చిత్రాన్ని రీరిలీజ్ చేయగా, భారీ వసూళ్లతో నయా రికార్డు సెట్ చేసింది. ఇన్నేళ్ల తర్వాత పోకిరి విడుదలైన తేదీన మహేష్-త్రివిక్రమ్ మూవీ విడుదల కానుంది. 

అలాగే ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ బాహుబలి 2 విడుదలైంది కూడా ఈ తేదీనే. 2017 ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి 2 రికార్డ్స్ గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే. వెయ్యి కోట్ల మార్కు చేరుకున్న మొదటి ఇండియన్ మూవీగా బాహుబలి చరిత్ర సృష్టించింది. మరి పోకిరి, బాహుబలి 2 సెంటిమెంట్ రిపీట్ అయితే.. మహేష్ ఖాతాలో మరో ఎపిక్ బ్లాక్ బస్టర్ నమోదు కానుంది. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. త్రివిక్రమ్ శైలికి భిన్నంగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ ని గతంలో ఎన్నడూ చూడని విధంగా త్రివిక్రమ్ ప్రజెంట్ చేయనున్నాడట. మహేష్, త్రివిక్రమ్ వరుస విజయాలతో ఫార్మ్ లో ఉండగా మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios