రిలీజై వారం తిరక్కుండానే పైరసీ చేసి సినిమాని యూట్యూబ్ లో పెట్టేస్తే ఏ డైరక్టర్ కైనా, నిర్మాతకైనా బాధగానే ఉంటుంది. నెలల తరబడి కష్టపడి చేసిన సినిమాని రైట్స్,ఫర్మిషన్స్ లేకుండా పైరసీ చేయటం దుర్మార్గం. ఈ మధ్యకాలంలో పైరసీ మరీ ఎక్కువైంది. పెద్ద సినిమా నిర్మాతలే ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. దాంతో పైరసీదారులు మరీ రెచ్చిపోతున్నారు. కొందరు పోలీస్ లను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ తెలుగు దర్శకుడు తమ సినిమా పైరసీ అయ్యిందని పోలీస్ లను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెలితే..తెలుగు సినీ దర్శకుడు వీరస్వామి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఏప్రిల్‌ 28 ఏం జరిగింది’ సినిమా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా వీరస్వామి డైరెక్ట్‌ చేసి నిర్మించిన సినిమా ఏప్రిల్‌ 28 ఏం జరిగింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

ఇదో సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో రంజిత్, షెర్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్,టీజర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచింది. ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలేని ట్విస్ట్‌లతో రూపొందుతున్న మా చిత్రంలోని ప్రతి మలుపు ఆసక్తికరంగా  వుంటుంది. ముఖ్యంగా చిత్రంలోని ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, పతాక సన్నివేశాలు ఎవరూ ఊహించని రీతిలో షాకింగ్‌గా వుంటాయి. థ్రిల్లర్‌ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు అని నిర్మాతలు చెప్పారు.