Asianet News TeluguAsianet News Telugu

ఏపీలోనూ ‘కల్కి’ టికెట్‌ రేట్ల పెంపు కు ఫర్మిషన్, ఎంత పెరుగుతాయంటే

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

AP govt permits hike in ticket rates for Kalki 2898 AD jsp
Author
First Published Jun 25, 2024, 6:45 AM IST | Last Updated Jun 25, 2024, 6:45 AM IST

మరో రెండు రోజుల్లో కల్కి సినిమా వచ్చేస్తోంది. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా‘కల్కి’ సినిమా గురించిన కబుర్లే.  ప్రభాస్ హీరోగా చేయటం, వైజయంతీ మూవీస్ బేనర్ మీద ‘మహానటి’వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించటంతో క్రేజ్ నెక్ట్స్ లెవిల్ కు వెళ్ళిపోయింది. దానికి తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే కీ రోల్స్ లో కనిపించటంతో మిగతా సినీ పరిశ్రమల్లో కూడా ఇదే టాపిక్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఇప్పటికే తెలంగాణా ఈ చిత్రం ఎగస్ట్రా షోలకు, టిక్కెట్ రేట్ల  పెంపుకు ఫర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రా ప్రభుత్వం కూడా ఫర్మిషన్ ఇచ్చింది.  ఆ వివరాల్లోకి వెళితే...
  
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి రెండు వారాల పాటు టికెట్‌ ధరలు  పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌ ధరల పెంపు, ఎగస్ట్రా షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్వనీదత్‌ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్‌పై సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా జీవో  జారీ చేసింది. చాలా రోజుల తర్వాత థియేటర్స్ మళ్లీ కళకళలాడబోతున్నాయి. వారం ముందు నుంచే కల్కి హవా స్పష్టంగా కనిపిస్తుంది. 

మరో ప్రక్క ఈ చిత్రానికి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను 25వ తేదీన చేయాలనుకున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిని అతిథులుగా నిర్మాత అశ్వనీదత్ ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటంతో చంద్రబాబు వస్తారా? రారా? అనే సందేహం వ్యక్తమైంది. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈవెంట్ ను రద్దు చేశారు. 25 కాకుండా 26వ తేదీన కొంచెం వెసులుబాటు ఉండటంతో ఆరోజు చంద్రబాబు హాజరయ్యే అవకాశముందంటున్నారు. దీంతో ఈవెంట్ ను 26వ తేదీన చేయాలని భావిస్తున్నారు. సినిమా విడుదల తేదీ 27. దీనికి ఒకరోజు ముందు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించడంవల్ల పెద్దగా కలిసొచ్చేదేమీ లేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ చూస్తే హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని విధంగా ‘కల్కి’ ఉంటుందని  స్పష్టమవుతోంది. ఈ సినిమాకు యుఎస్ సహా పలు దేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై  గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో అసలు ప్రభాస్ చేయబోయో పాత్ర ఏమిటి...అనేది చర్చగా మారింది. టైటిల్ కల్కి కాబట్టి ప్రభాస్ చేసే పాత్ర కల్కి అయ్యింటుంది కదా ఇంకేముంటుంది అని అనచ్చు. అయితే ప్రభాస్ కల్కి కాదు అని అనిపిస్తోంది.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios