భారీ అంచనాల నడుమ మరికొన్ని గంటల్లో సైరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్ ఆడియన్స్ ప్రీమియర్ షోలకు సిద్ధం అవుతుంటే.. తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలోని ప్రధాన నగరాల్లోని మెగా అభిమానులు సైరా స్పెషల్ షోలకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా సైరా చిత్ర ప్రత్యేక షోలకు అనుమతి ఉంటుందా లేదా అనే అనుమానాలు నెలకొని ఉన్న సమయంలో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది. 

ఏపీ ప్రభుత్వం సైరా చిత్ర ప్రత్యేక షోలకు అనుమతినిచ్చింది. రెండు స్పెషల్ షోలతో పాటు, నాలుగు రెగ్యులర్ షోలు మొత్తం రోజుకు 6 షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. 

ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని ప్రధాన థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొని ఉంది. చిరంజీవి కటౌట్లు, బ్యానర్లతో అభిమానులు సందడి చేస్తున్నారు. దాదాపుగా 250 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది.