యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహోపై ఆకాశాన్ని తాకే అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం సాహో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రంపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో నిర్మాతలు స్పెషల్ షోలకు ప్లాన్ చేశారు. స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వాలని సాహో నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఏపీ చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు చేసుకున్నారు. 'ప్రభాస్ నటించిన సాహో చిత్రం భారీ అంచనాలతో విడుదల కాబోతోంది. సాహో చిత్రం కోసం థియేటర్స్ వద్ద భారీ సంఖ్యలో జనాలు వస్తారు. భారీగా ఉన్నడిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు సాహో స్పెషల్ షోలని ప్రదర్శించాలనుకుంటున్నాం. 

ఈ ఈనేపథ్యంలో రాత్రి 1:00 గంటల నుంచి ఉదయం 10:00 గంటల మధ్యలో రెండు ప్రత్యేక షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని సాహో నిర్మాతలు దరఖాస్తులో పేర్కొన్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీ దరఖాస్తుని పరిశీలించి సాహో ప్రత్యేక షోలకు అనుమతినిచ్చారు. దీనితో సాహో చిత్రాన్ని తొలి వారం రోజుకు 6 షోలు ప్రదర్శించనున్నారు.  

ఏపీ లోని ప్రధాన నగరాలలో సాహో ప్రత్యేక షోలని ప్రదర్శించనున్నారు.