ఈ మధ్య జగన్ సినీ నటులపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వరుసగా వారికి పదవులిచ్చుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ గా టలీవుడ్ నటుడు జోగినాయుడికి కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం. 

టాలీవుడ్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ లో వరుసగా పదవులు పొందుతున్నారు నటులు. సీఎం జగన్ కూడా ఇండస్ట్రీకి చెందినవారికి ఈ మధ్య ఎక్కువగా నామినేటెడ్ పదవులిచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈక్రమంలోనే మీడియా సలహాదారుగా కమెడియన్అలిని నియమించిన జగన్.. ఏపీ ఫిల్మ్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళీని నియమించారు. ఈక్రమంలో మరో సినీనటుడికి ప్రభఉత్వంలో కీలకపదవి అప్పగిచారు ముఖ్యమంత్రి. 

సినీ పరిశ్రమకు చెందిన నటుడు, కమెడియన్, టీవి యాంకర్ జోగినాయుడుకు ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జోగినాయుడు యాంకర్ జాన్సీ మాజీ భర్త.. వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ప్రభుత్వంలో ఆయన పదవి కన్ ఫార్మ్ చేస్తూ.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలంగా జోగినాయుడు వైసీపిలో కోనసాగుతున్నారు. 

అయితే జోగినాయుడు ఈ పదవిలో ఎంత కాలం కొనసాగుతారు, ప్రభుత్వం నుంచి అతనికి ఎంత వేతనం రాబోతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ అంశాలను ఉత్తర్వుల్లో కూడా పేర్కొనలేదు. ఏపీ క్రియేటివిటీ కల్చర్‌ కమిషన్‌ సీఈవో నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు జోగి నాయుడును క్రియేటివ్‌ హెడ్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జోగినాయుడుకు పి కేటగిరిలో వేతనం, ఇతర అలవెన్సులు వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు. 

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వరకూ ఉండటంలో.. ఈ పదవిలో అప్పటి వరక జోగినాయుడు కొనసాగే అవకాశం ఉంది. మరికొందరు సినీ ప్రముఖులకు కూడా కొన్ని పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. 2019 ఎలక్షన్ టైమ్ లో చాలా మంది సినీ తారలు వైసీపికి సపోర్ట్ చేస్తూ... ప్రచారం కూడా చేశారు. అందులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీకి ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఛానెల్ చైర్మన్ పదవి రాగా..పలు ఆరోపణలు కారణంగా ఆయనను తప్పించారు. దాంతో పృద్థ్వీ జనసేనలోకి వచ్చారు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన రోజా మంత్రి పదవిలో కొనసాగుతుండగా.. అలీ. పోసాని నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు.