పవన్‌కి, జగన్‌కి అటు రాజకీయాల పరంగానూ, ఇటు సినిమాల పరంగానూ పడటం లేదు. దీని కారణంగానే టికెట్లు రేట్లు తగ్గించడం, నిబంధనలు సరిగా పాటించని థియేటర్లని సీజ్ చేయడం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఓ వైపు ఇదంతా జరుగుతున్నా సీఎం జగన్.. పవన్‌కి ఓ మంచి పనిచేయడం విశేషం.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(CM Jagan) ఏపీ రాజకీయాల విషయంలో ఇద్దరూ బద్ద శత్రువులు. వైసీపీ ప్రభుత్వంపై ఛాన్స్ దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు పవన్ కళ్యాణ్. దీంతో వీరిద్దరి రాజకీయ సమస్య ఇప్పుడు టాలీవుడ్‌కి పాకింది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం, ఆ వివాదం పెరగడానికి పవన్ కళ్యాణే అనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్‌పై కూడా ఈ విషయంలో ఏపీ వైసీపీ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన రెమ్యూనరేషన్‌ని కూడా ప్రశ్నిస్తున్నారు. దీని కారణంగా అనేక కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.
దీంతో పవన్‌కి, జగన్‌కి అటు రాజకీయాల పరంగానూ, ఇటు సినిమాల పరంగానూ పడటం లేదు. దీని కారణంగానే టికెట్లు రేట్లు తగ్గించడం, నిబంధనలు సరిగా పాటించని థియేటర్లని సీజ్ చేయడం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఓ వైపు ఇదంతా జరుగుతున్నా సీఎం జగన్.. పవన్‌కి ఓ మంచి పనిచేయడం విశేషం. పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లా నాయక్`(Bheemla Nayak) ఈ నెల(ఫిబ్రవరి) 25న విడుదలవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పవన్ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
కరోనా కారణంగా ఏపీలో థియేటర్ల విషయంలో యాభై శాతం ఆక్యుపెన్సీ అమల్లో ఉంది. సీఎం జగన్‌తో చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి వంటి పెద్దలు, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి సంబంధించిన కమిటీ మీటింగ్‌ల ఫలితం, పైగా కరోనా తగ్గడంతో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చింది ఏపీ ప్రభుత్వం. అది గురువారం నుంచే అమల్లోకి రాబోతుండటం విశేషం. కానీ శుక్రవారం సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచే వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ అమల్లోకి వచ్చినట్టయ్యింది. మరోవైపు అంతకు ముందే నైట్ కర్ఫ్యూని కూడా ఎత్తేసింది ప్రభుత్వం. ఇది మోహన్‌బాబు నటించిన `సన్ ఆఫ్ ఇండియా`తోపాటు నేడు రిలీజ్ అయినసినిమాలకు కలిసొస్తుంది.
అయితే అందరికంటే ఎక్కువగా కలిసొచ్చేది మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల్లో అదొక్కటే ఉంది. నైట్ కర్ఫ్యూ ఎత్తేయడంతో నైట్ షోస్‌కి యదాతథంగా పడతాయి. వంద శాతం ఆక్యపెన్సీ కూడా అమల్లోకి రావడంతో ఇది ప్రధానంగా `భీమ్లా నాయక్` చిత్రానికి హెల్ప్ అవుతుందని అంటున్నారు. అయితే టికెట్ల రేట్ల విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అన్ని థియేటర్లలో ఒకే రేట్ ఉంటుందనేది ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న వాదన. కాకపోతే మూడు స్లాబులుగా ఈ టికెట్ రేట్లని నిర్ణయించారని, గతంలో కంటే పెంచుతున్నట్టు తెలుస్తుంది. అయితే టికెట్ రేట్లకి సంబంధించి సవరించిన జీవో రావాల్సి ఉంది. ప్రభుత్వం త్వరలోనే ఈ జీవోని విడుదల చేస్తుందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ నటించిన `భీమ్లానాయక్` సినిమా కారణంగా ఏపీ ప్రభుత్వం జీవోని ఆలస్యం చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది. కానీ గురువారం జరిగిన చర్చల అనంతరం ఈ వారంలోనే జీవో వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. `భీమ్లా నాయక్` రిలీజ్‌కి ముందు జీవో వస్తే ఇక పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి నిజంగానే వచ్చే వారంలో జీవో వస్తుందా? లేక పవన్‌పై కోపంతో మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తారా? అనేది వేచి చూడాలి.
ఇక పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన `భీమ్లా నాయక్` చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రానికి రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. హిందీలోనూ రిలీజ్ కాబోతుండటం విశేషం. త్వరలోనే ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు, ఈ నెల 21న గ్రాండ్‌గా హైదరాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు.
