సునీల్ భార్యగా అనసూయ..ఏంటీ విచిత్రం !
రంగస్థలం, క్షణం లాంటి సినిమాలు అనసూయ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో మరో పాత్రతో వస్తున్నారు అనసూయ. అయితే ఇప్పుడామె సునీల్ సరసన చేస్తూండటంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.
జబర్దస్త్ షో నుంచి వెండితెరకు వచ్చి క్లిక్ అయ్యిన అందం అనసూయ. ఆమె నాగ్ హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో చిన్న పాత్ర చేసింది. అది క్లిక్ అవటంతో ఆ తర్వాత వరస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. అనసూయ ఇప్పుడు స్టార్ యాక్టర్ ఎదిగిపోయింది. ఈ క్రమంలో ఆమె చేసిన రంగస్థలం, క్షణం లాంటి సినిమాలు అనసూయ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో మరో పాత్రతో వస్తున్నారు అనసూయ. అయితే ఇప్పుడామె సునీల్ సరసన చేస్తూండటంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.
ఇక హీరో నుంచి కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరస సినిమాలు చేస్తున్నారు సునీల్. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు ఈయన స్దాయికి తగ్గ క్యారక్టర్ పడలేదు. ప్రస్తుతం ఆరు సినిమాలు చేస్తున్నారు సునీల్. తాజాగా ఈయన అనసూయ భరద్వాజ్‌తో జోడీ కడుతున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అందుతున్న సమాచారం మేరకు ఈ ఇద్దరూ జంటగా భార్య భర్తల్లా..అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా కాస్త బ్రేక్ పడింది. పుష్ప షూటింగ్‌లో ఈ మధ్యే అనసూయ జాయిన్ అయింది. ఈ సినిమాలో సునీల్ ఒక విలన్ గా కనిపిస్తారని, ఆయన భార్యగా అనసూయది ఓ డిఫరెంట్ రోల్ అని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.