లుక్: 'దాక్షాయని' పాత్ర వెనక దాగున్న నిజం ఇదీ

 పుష్ప సినిమాలో అనసూయ… దాక్షాయని పాత్రలో కనిపించనుంది. ఇక దాక్షాయని ఫస్ట్ లుక్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్రటీమ్. ఇక ఈ లుక్ లో అనసూయ.. చాలా మాసివ్ లుక్ లో కనిపించాడు.  

Anusuya as Dakshayani.. arrogance and pride personified!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించి వరసపెట్టి క్యారక్టర్స్ ని పరిచయం చేస్తున్నారు. అప్పట్లో బాహుబలికి చేసిన ప్రమోషన్ తరహాలోనే ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు. అలాగే ప్రతీపాత్రను స్పెషల్ గా డిజైన్ చేసారని వినికిడి. బాహుబలిలో రమ్యకృష్ణ తరహాలో ఈ సినిమాలో జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. 

తాజాగా… ఈ ఆమె లుక్ ని రిలీజ్ చేసింది పుష్ప యూనిట్. పుష్ప సినిమాలో అనసూయ… దాక్షాయని పాత్రలో కనిపించనుంది. ఇక దాక్షాయని ఫస్ట్ లుక్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్రటీమ్. ఇక ఈ లుక్ లో అనసూయ.. చాలా మాసివ్ లుక్ లో కనిపించాడు. ఒళ్లంతా నగలు వేసుకుని..ఊర మాస్‌ లుక్‌ లో అనసూయ కనిపిస్తోంది.

రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ..పెద్ద సినిమాల్లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప సినిమాలో చేస్తున్న 'దాక్షాయని' పాత్ర ..సినిమాలో విలన్ గా చేస్తున్న సునీల్ కు భార్య క్యారక్టర్ అని తెలుస్తోంది. చాలా క్రూరత్వంతో సాగుతుందని, రంగమ్మత్త పాత్రకు పూర్తి ఆపోజిట్  . తాజాగా ఈ చిత్రంలో అనసూయ లుక్‌ని రివీల్‌ చేసింది చిత్ర  టీమ్. 

 

సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా అలరించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.  ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫష్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌17న విడుదల కానుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios