గత కొంత కాలంగా బాలీవుడ్ బ్యూటీ, విరాక్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ పై కొన్ని రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె గర్భ దాల్చినట్లు అందుకే కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోవడం లేదని వివిధరకాల పుకార్లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. బాలీవుడ్ మీడియాలో ఈ వార్తల డోస్ పెరగడంతో అనుష్క క్లారిటీ ఇచ్చింది. 

అమ్మడు చెప్పిన విధానం చూస్తుంటే కొంచెం గట్టిగానే బాలీవుడ్ మీడియాకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రెగ్నెన్సీ రావడం వల్ల సినిమాలు తగ్గిస్తున్నట్లు వస్తోన్న వార్తలని అబద్ధాలని అనుష్క వివరించారు. అంతే కాకుండా మ్యారేజ్ మ్యాటర్ దాచవచ్చు గాని ప్రెగ్నెన్సీని ఎలా దాచగలం అంటూ కౌంటర్ ఇచ్చింది. 

ఇక ఇలాంటి పరిస్థితులు సినీ తరాలకు కొత్తేమి కాదని పెళ్లి కాకుండానే ఈ పుకార్లు వివాహితను, ప్రెగ్నెన్సీ రాకముందే తల్లిని చేస్తుంటాయని చెబుతూ.. ఇలాంటి రూమర్స్ ని తాను పట్టించుకోనని అనుష్క తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.