ఈ మధ్య అనుష్క శెట్టి సినిమాల జోరు తగ్గించింది. బాహుబలి సిరీస్ తరువాత అనుష్క చేసింది ఇప్పటివరకు రెండు సినిమాలు మాత్రమే. 2018లో విడుదలైన భాగమతి, లేటెస్ట్ రిలీజ్ నిశ్శబ్దం చిత్రాలు అనుష్క చేయడం జరిగింది. సైరా మూవీలో ఓ గెస్ట్ రోల్ చేశారు. ఆమె పాపులారిటీ రీత్యా వరుస చిత్రాలు చేసే అవకాశం ఉన్నా ఎందుకో ఆచితూచి అడుగులేస్తున్నారు. ఓ టి టి లో విడుదలైన నిశ్శబ్దం మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. 

మరో వైపు అనుష్క పెళ్లి ఆలోచనలో ఉండడం వలెనే సినిమాలు ఒప్పుకోవడం లేదనే వాదన విపిస్తుంది. ఈ విషయంలో అనుష్క తనకు నచ్చినవాడు దొరికినప్పుడే పెళ్లి అంటుంది. 40కి రీచ్ అయిన అనుష్క ఇంకా నచ్చినవాడు దొరకాలంటూ, మాట డేటా వేయడం విశేషం. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అవన్నీ రూమర్స్ మాత్రమే అని ఇద్దరూ కొట్టిపారేశారు. 

కాగా అనుష్క వచ్చే ఏడాది రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతుంది. 2020 బ్యాడ్ ఇయర్ గా భావిస్తున్న అనుష్క, తన లేటెస్ట్ మూవీస్ కి సంబందించిన వివరాలు 2021లో తెలియజేయాలని అనుకుంటున్నారట. మరి అనుష్క ప్రకటించే ఆ రెండు చిత్రాల దర్శకులు ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైంది. ప్రస్తుతం అనుష్క స్టార్ హీరోలతో నటించడం లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో అనుష్క ప్రకటించే ఆ రెండు చిత్రాలు కూడా లేడీ ఓరియెంటెడ్ అయ్యే అవకాశం కలదు.