సౌత్ ఇండియన్ స్వీటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం నిశ్శబ్దం. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సౌత్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  

ఫైనల్ గా సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. పెయింట్ వేస్తూ అనుష్క చాలా క్యూట్ గా కనిపిస్తోంది. అలాగే అందులో ఒక హెవీ ఎమోషన్ ఉన్నట్లు అర్ధమవుతోంది. ఆర్ట్ బ్యాక్ డ్రాప్ లో అనుష్క తెరపై సరికొత్త థ్రిల్ ని కలిగించనుందని సమాచారం. అయితే పోస్టర్ లో అనుష్క పాత్ర 'సాక్షి మ్యూట్ ఆర్టిస్ట్' అనే లైన్ ఇవ్వడంతో అనుష్క పాత్రకు మూగ, చెవుడు అని అర్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ లో మాధవన్ అలాగే హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 

చాలా వరకు యూఎస్ లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించిన చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ పనులను కొన్ని వారాల క్రితం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు. అందరిని ఆకట్టుకునే విధంగా మొదట ఒక టీజర్ ని రిలీజ్ చేయాలనీ కోన వెంకట్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ - హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కించారు. సౌత్ లో ఎలాగూ అనుష్కకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి బాలీవుడ్ లో ప్రమోషన్ డోస్ కాస్త పెంచాలని చూస్తున్నారు.