Asianet News TeluguAsianet News Telugu

అనుష్క శెట్టి సినిమా ఇంత దారుణమా.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫ్లాప్ షో

నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

Anushka Shetty Miss shetty mr polishetty movie trp rating dtr
Author
First Published Jan 6, 2024, 10:12 AM IST

నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. యువ హీరో నవీన్ పోలిశెట్టి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

స్టాండప్ కమెడియన్ గా నవ్విస్తూ అనుష్కతో కలసి ఎమోషనల్ గా కూడా మెప్పించాడు. వీళ్లిద్దరికీ ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కెమిస్ట్రీ అద్భుతంగా పండించారు. అనుష్క చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్రలో మెప్పించింది. ఆమె బొద్దుగా మారినప్పటికీ ఈ చిత్రానికి అది అడ్డంకి కాలేదు. 

యువ దర్శకుడు మహేష్ ఫన్ అండ్ ఎమోషన్ మిక్స్ చేస్తూ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. థియేటర్స్ లో అలరించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం బుల్లితెరపై మాత్రం ఊహించని విధంగా ఫ్లాప్ అయింది. గత వారం తొలిసారి ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేశారు. అయితే చాలా దారుణంగా ఈ చిత్రానికి కేవలం 3.2 టిఆర్పి రేటింగ్ నమోదైంది. అనుష్క క్రేజ్ కి ఇది డిజాస్టర్ అనే చెప్పాలి. 

ఆల్రెడీ ఈ చిత్రం ఓటిటిలో కూడా రిలీజయింది. బహుశా ఓటిటి ప్రభావం వల్లే టీవీలో ఈ చిత్రం ఫ్లాప్ అయింది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే విధంగా స్టార్ మా లో తొలిసారి ప్రసారమైన కార్తికేయ బెదురులంక చిత్రం కూడా దారుణమైన రేటింగ్ నమోదు చేసుకుంది. ఈ చిత్రానికి 1.7 మాత్రమే టిఆర్పి నమోదైంది. అయితే ఇప్పటికే టీవీల్లో పలు మార్లు ప్రదర్శించబడిన వాల్తేరు వీరయ్య, విరూపాక్ష లాంటి చిత్రాలు ఇప్పటికి మంచి రేటింగ్స్ రాబడుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios