నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం సెప్టెంబర్ 7న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. 

నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం సెప్టెంబర్ 7న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఇప్పటివరకు నవీన్ పోలిశెట్టి మాత్రమే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ కష్టపడ్డాడు. అనుష్క మాత్రం ఎక్కడా కనిపించలేదు. 

అనుష్క ఈ చిత్రంలో చెఫ్ పాత్రలో నటిస్తోంది. ఇక నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి లాంటి అంశాలతో డైరెక్టర్ మహేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిలీజ్ కి ఇక రెండురోజులే సమయం ఉండడంతో స్వీటీ అనుష్క కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. 

ఆమె చెఫ్ పాత్రలో నటిస్తోంది కాబట్టి ఆ తరహాలోనే ప్రచారం నిర్వహిస్తోంది. దీనికోసం తనకి బాగా క్లోజ్ అయిన బాహుబలి ప్రభాస్ ని ఉపయోగించుకుంది. తనకు ఇష్టమైన రొయ్యల పలావ్, మంగుళూరు చికెన్ వంటకాల రెసిపీ లని పోస్ట్ చేసి ప్రభాస్ కి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్ ప్రకారం ప్రభాస్ తనకు ఇష్టమైన వంటకాలకు సంబందించిన రెసిపీ లని పోస్ట్ చేసి మరొకరికి ఛాలెంజ్ ఇవ్వాలి. 

View post on Instagram

అనుష్క ఛాలెంజ్ పై ప్రభాస్ స్పందించాడు. ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. నాకు స్వీటీ దశాబ్దాలుగా తెలుసు. కానీ ఇంతవరకు ఆమెకి ఇష్టమైన వంటకం ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నా అని పోస్ట్ చేశాడు. తాను ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ లో రాంచరణ్ కి పాస్ చేస్తున్నట్లు తెలిపాడు. దీనితో చరణ్ ఇలా బుక్కయ్యాడన్నమాట. 

ప్రభాస్ పోస్ట్ పై నవీన్ పోలిశెట్టి కామెంట్స్ చేస్తూ అందరూ సెప్టెంబర్ 7న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూసి రొయ్యల పలావ్, మంగుళూరు చికెన్ ట్రై చేయండి అంటూ కామెంట్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం చూసి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.