రానా, అనుష్కల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీరిద్దరూ రుద్రమదేవి సినిమాతో పాటు బాహుబలి సిరీస్ లో కలిసి నటించారు. రాజమౌళి, ప్రభాస్ లతో పాటు అనుష్కకు మంచి మిత్రుడిగా రానా ఉన్నాడు. కాగా నేడు రానాకు బర్త్ డే విషెస్ చెప్పిన అనుష్క... బ్రో అంటూ ట్వీట్ చేసింది. అనుష్క ట్వీట్ చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. అనుష్కకు రానా బ్రో ఎప్పుడయ్యాడని చర్చ మొదలెట్టారు. 

ఏళ్లుగా మిత్రులుగా ఉన్న రానా, అనుష్క గతంలో ఎన్నడూ ఈ విధమైన పిలుపులు పిలుచుకోలేదు. వీరి మధ్య ప్రేమ, అఫైర్స్ లాంటి వార్తలు రాకున్నా... మంచి మిత్రులుగా అందరికీ తెలుసు. నేడు సడన్ గా అనుష్క రానాను అన్నగా ఫీలవడం ఆసక్తి రేపుతోంది. అనుష్క ట్వీట్ కి నెటిజెన్స్ మాత్రం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

రానాతో అనుష్కకు ఉన్న కొత్త బంధం మాత్రం నేడు రివీల్ అయ్యింది. ఇక సోషల్ మీడియా ద్వారా రానాకు ఫ్యాన్స్ మరియు చిత్ర ప్రముఖులు బర్త్ డే విషెష్ తెలియజేశారు. అలాగే విరాట పర్వం నుండి ఆయన లుక్ రివీల్ చేశారు. చేతిలో గన్, సీరియస్ లుక్ తో నక్సలైట్ గా రానా లుక్ ఆసక్తి రేపుతోంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.