అనుష్క శర్మ ప్రస్తుతం ప్రెగ్నెన్సీని ఎంజాయ్‌ చేస్తుంది. ఇటీవల ఓ ప్రకటలో భాగంగా తన కడుపులో ఉన్న బిడ్డకి పాటలు వినిపిస్తూ, ఇష్టమైన ఫుడ్‌ తింటూ ఆ అనుభూతిని ఆస్వాధిస్తుంది. మరోవైపు భర్త విరాట్‌ కొహ్లీతోపాటు సరదాగా గడుపుతుంది. స్వయంగా విరాట్‌ దగ్గరుండి అనుష్కకి వ్యాయామాలు చేయిస్తున్నాడు. ఈ ఫోటోలను ఇటీవల పంచుకుంది అనుష్క. 

తాజాగా మరో అరుదైన ఫోటోని పంచుకుంది. అంతేకాదు ఫన్నీ కామెంట్‌ చేసింది. తాను కాళ్లు మలుచుకుని కూర్చొని తినలేకపోతుందట. గతంలో తాను చైర్‌ మీద కాళ్లు మలుచుకుని కూర్చొని తింటున్న ఫోటోని షేర్‌ చేసింది. `గతంలో ఇలా కాళ్లు మలుచుకుని తినగలిగాను. కానీ ఇప్పుడు అలా చేయలేకపోతున్నా. కానీ తింటున్నా` అని పేర్కొంది. ప్రెగ్నెన్సీ వల్ల తన ఉదర భాగం పెరిగింది. దీంతో కాళ్లు మలుచుకోలేని పరిస్థితి నెలకొంది. జనరల్‌గానే గర్భంతో ఉన్నప్పుడు ఫ్రీగా ఉండలేరు. ఇప్పుడు అనుష్క శర్మ అలాంటి ఇబ్బందులే పడుతుంది. 

అనుష్క జనవరిలో తన బిడ్డకి జన్మనివ్వబోతుంది. అనుష్క, విరాటకొహ్లీ కొన్నాళ్లుగా ప్రేమించుకుని 2017లో డిసెంబర్‌ 11న ఇటలీలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ టైమ్‌లో తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది అనుష్క శర్మ. ఇటీవల తమ మ్యారేజ్‌ జరిగి మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క స్పందిస్తూ, `మా పెళ్ళి అయి మూడేళ్లు.. త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం` అని పేర్కొంది.