అప్పుడే అన్ని విషయాలు అర్థం అవుతాయి.. రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రచారం, అనుష్క శర్మ పోస్ట్ వైరల్
బాలీవుడ్ నటి, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా భలే యాక్టివ్ గా ఉంటుంది.

బాలీవుడ్ నటి, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా భలే యాక్టివ్ గా ఉంటుంది. విరాట్ కోహ్లీ, అనుష్క జంటకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
అనుష్క, కోహ్లీ దంపతులు రెండవసారి తల్లిందండ్రులు కాబోతున్నట్లు బాలీవుడ్ లో ప్రచారం మొదలైంది. అయితే ఈ రూమర్స్ పై అనుష్క శర్మ, కోహ్లీ దంపతులు ఇంతవరకు స్పందించలేదు. అనుష్క తన చిత్రాలతో బిజీగా ఉండగా.. కోహ్లీ వరల్డ్ కప్ సన్నాహకాలతో ఉన్నారు.
అయితే తాజాగా అనుష్క శర్మ ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. అభిప్రాయాలన్నీ వ్యక్తిగత కోణం నుంచి వస్తాయని అర్థం చేసుకున్నప్పుడు వాటి జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుందో అర్థం అవుతుంది అని అనుష్క కొటేషన్ పెట్టింది. తన రెండవ ప్రెగ్నన్సీ రూమర్స్ ని అనుష్క ఖండిస్తూ ఈ పోస్ట్ పెట్టిందా అంటూ నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది.
ఇటీవల అనుష్క, కోహ్లీ ముంబైలో ఓ ప్రసూతి ఆసుపత్రి వద్ద కనిపించారని అప్పటి నుంచి ఈ రూమర్స్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. చాలా కాలం ప్రేమలో ఉన్న అనుష్క, కోహ్లీ జంట 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2021లో ఈ జంటకు వామిక కుమార్తె జన్మించింది. యాడ్ షూట్ తో కోహ్లీ, అనుష్క మధ్య మొదలైన పరిచయం ఇలా దంపతులుగా జీవనం సాగించే వరకు వచ్చింది.