బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. భర్త విరాట్ కోహ్లీతో ఫోటోకి పోజిచ్చిన అనుష్క శర్మ..జనవరిలో ఆమె బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు తెలియజేసింది. 

గర్భంతోనే అనుష్క దుబాయ్ వెళ్లి 2020 క్రికెట్ ఎంజాయ్ చేశారు. స్టేడియంలో కూర్చొని భర్త కోహ్లీ ఆటను ఎంజాయ్ చేశారు. ఐతే అనుష్క గర్భంతో కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. బేబీ బంప్ తో అనుష్క షూటింగ్ సెట్ కి హాజరైన ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఓ యాడ్ షూట్ కోసం అనుష్క షూటింగ్ సెట్ కి రావడం జరిగింది. ప్రస్తుతం అనుష్క శర్మ పాతాల్ లోక్, బుల్ బుల్ చిత్రాలలో నటిస్తున్నారు. బుల్ బుల్ మూవీని అనుష్క శర్మ స్వయంగా నిర్మిస్తున్నారు.