‘బాహుబలి’ సినిమాతో తనేంటో ప్రపంచానికి మరోసారి తెలియచేసిన   స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. అనుష్క చిత్ర పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పోస్టర్  విడుదల చేస్తూ  యూనిట్‌  శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ మీరా పోస్టర్ చూడవచ్చు. ఈ పోస్టర్‌లో అనుష్క చేతులు మాత్రమే చూపించటం జరిగింది.

ఈ చిత్రంలో ఆమె దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి...  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో తన లుక్‌ను తెలుపుతూ అనుష్క ఓ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది.  

 అమెరికా లోని సియాటల్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గ‌నుంది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ & మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీర‌జ కోన‌, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ – షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్;సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్