సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ పెను దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్కో నటి టైమ్  వచ్చినప్పుడు దీనిపై తన గొంతు వినిపిస్తూనే ఉన్నారు. ఈ విషయమై  చర్చ ఈ మధ్య కొంత తగ్గినట్లు కనిపించినా..అప్పడప్పుడూ ఎవరో ఒకరు పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి నోరు విప్పుతున్నారు. సినిమాలో అవకాశం కోసం వస్తే  తనను లైంగిక వేధింపులకు గురిచేశారని చెప్తున్నారు.  సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. 

అయితే పెద్ద హీరోయిన్లు మాత్రం తమకు అలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదని చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నా, రకుల్ లాంటి హీరోయిన్లు కూడా తమకు ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఫేస్ చేయలేదని.. అంతా తమను చాలా బాగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. కానీ మరికొందరు హీరోయిన్లు మాత్రం దారుణమైన కష్టాలు ఫేస్ చేసామని మాట్లాడుతున్నారు. తాజాగా స్వీటీ అనుష్క ...ఈ విషయమై తన కామెంట్స్ ని మీడియా ముందు పెట్టింది.

అనుష్క మాట్లాడుతూ...ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని తాను చెప్పడం లేదు అని తెలిపింది.  ఇక్కడే కాదు అమ్మాయిలకు వారు ఏ రంగంలో ఉన్న కూడా ఈ బాధ తప్పదని అంది. కానీ తనకు మాత్రం ఇలాంటివి ఎదురు కాలేవని చెప్పింది. ఏ విషయం ఉన్నా తనకు నచ్చలేదంటే ముక్కుసూటిగా చెప్పేస్తానని అంటోంది. దాంతో ‘మీటు’, ‘కాస్టింగ్ కౌచ్’ లాంటి అంశాలు తన వరకు రాలేదని చెప్పింది.

అసలు ఓ అమ్మాయికి ఇలాంటివి ఇష్టం ఉండవు అన్నప్పుడు ఈ రకమైన విషయాలను అడగడం కూడా తప్పేనని అనుష్క తేల్చి చెప్పింది. మనం ఎంచుకునే ప్రతి దారిలో ఇలాంటివి ఉంటాయి కానీ వాటికీ భయపడకుండా, వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్తే ఇలాంటివన్నీ నథింగ్ అని చెబుతోంది. ఇలాంటివాటికి ‘నో’ చెబితేనే మగవాళ్ళు ఆడవాళ్ళని గౌరవిస్తారు అని చెప్పుకొచ్చింది. దీంతో కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందని మీరు కూడా ఒప్పుకున్నట్లు అయ్యింది. కాగా అనుష్క నిశ్శబ్దం సినిమా ప్రమోషన్ లో బిజీ ఉన్న అనుష్క అక్కడే వీటి పై చర్చించింది.