టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం నిశ్శబ్దం. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు పెరిగాయి. కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

రీసెంట్ గా యూఎస్ లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించడంతో సినిమా షూటింగ్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక వీలైనంత త్వరగా సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు. అందరిని ఆకట్టుకునే విధంగా మొదట ఒక టీజర్ ని రిలీజ్ చేయాలనీ కోన వెంకట్ ప్లాన్ చేస్తున్నారు. 

తెలుగుతో పాటు తమిళ్ - హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కించారు. సౌత్ లో ఎలాగూ అనుష్కకి మంచి క్రేజ్ ఉంది కాబట్టి బాలీవుడ్ లో ప్రమోషన్ డోస్ కాస్త పెంచాలని చూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో మాధవన్ అలాగే హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.